బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ గురించి ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఆ ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియోలో సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 


అయితే ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కి జోడోగా ఆలియా భట్ కనిపిస్తుందని తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆలియాభట్ ఆలియా నుండి తప్పుకుమ్దని వార్తలు వచ్చాయి. కానీ మోషన్ పోస్టర్ తో పాటు, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అప్డేట్ ని సోషల్ మీడియా ద్వారా అలియా షేర్ చేయడంతో ఆమెపై అప్పటి వరకు వచ్చిన వార్తలన్ని ఫేక్ అని తేలిపోయింది. ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి తన పదిరోజుల డేట్స్ ఇచ్చిందట.

 

ఆ పది రోజుల కోసం ఆలియా ఐదుకోట్లు అడిగిందట. అంటే రోజుకి యాభై లక్షలు అన్నమాట. ఒక తెలుగు సినిమా హీరోయిన్ కి రోజుకి యాభై లక్షలంటే చాలా ఎక్కువే. అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ భామ ఆలియాకి ఆమాత్రం ఇచ్చుకోవడం కరెక్టే అని అంటున్నారు.

 

బాలీవుడ్ లో మార్కెట్ పెరగాలన్నా,  సినిమాకి క్రేజ్ తీసుకురావాలన్నా అక్కడ గుర్తింపు పొందిన నటులు ఉండడం సినిమాకి ప్లస్సే. ఆలియాకి బాలీవుద్ లో ఉన్న క్రేజ్ పరంగా ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వాలనే డిసైడ్ అయ్యారట. మరి ఆలియాకి అంత ఇస్తే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కి ఎంత ఇస్తున్నారో..? లాక్డౌన్ పూర్తయ్యాక ఆలియా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: