సీనియ‌ర్ హీరోల‌కు జోడీ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. యంగ్ హీరోలకు దొరికినట్టు ఈ సీనియర్ కథానాయకులకు ...వాళ్ల ఏజ్ తగ్గ హీరోయిన్లు దొరకడం కష్టమైపోతోంది. ఈడు జోడు కుదిరితేనే ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న బాగుటుంద‌న్న‌ది ఈ సీనియ‌ర్ హీరోల న‌మ్మ‌కం. అందుకే సినిమా క‌థను వెతుక్కునే స‌మ‌యానికంటే హీరోయిన్ల సెల‌క్ష‌న్‌కు ఎక్కువ‌గా తీసుకుంటున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో నాగార్జున‌, చిరంజీవి, వెంక‌టేష్‌లాంటి సీనియ‌ర్ అగ్ర‌హీరోలు యువ హీరోల‌తో పోటీప‌డుతూ మ‌రీ బాక్సాఫీసును కొల్ల‌గొడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి...‘సైరా...నరసింహారెడ్డి’’ ద్వారా త‌న స్టామినా ఏంటో మ‌రోసారి ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు చాటిచెప్పాడు.

 

 అదే స‌మ‌యంలో సొగ్గాడే చిన్నినాయ‌నా, ఎఫ్‌2తో నాగార్జున‌, వెంక‌టేష్‌లు ఊహించ‌ని క‌లెక్ష‌న్ల‌తో టాలీవుడ్‌ను షేక్ చేశారు. కొత్త త‌ర‌హా, క‌థాబ‌ల‌మున్న సినిమాలు చేస్తూ యువ హీరోల‌కు స‌వాల్ విసురుతున్నారు. అయితే ఈ సీనియ‌ర్ హీరోల‌కు క‌థానాయిక‌లను ఎంపిక చేయ‌డం క‌ష్టంగామారింద‌ని ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు పేర్కొంటున్నారు. సైరా సినిమా కోసం నయనతారనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను కాకుండా.. సీనియ‌ర్ హీరోయిన్‌ త్రిషను ఎంపిక చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో  త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.  ఆమె ప్లేస్‌లో ప్రస్తుతం హీరోయిన్‌గా అంతగా క్రేజ్‌లేని కాజల్‌ను మరోసారి చిరంజీవి సరసన న‌టించేందుకు ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. 

 

 ఇక ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో చిరుకు హీరోయిన్ల సమస్య వెంటాడే అవకాశం ఉంది. మరోవైపు బాలకృష్ణకు గత కొన్నేళ్లుగా నయనతార తప్పించ  మరే క్రేజి హీరోయిన్‌తో నటించలేదు. బాలయ్యకు ప్రతి సినిమాలో కథానాయికల కొరత ఏర్పడుతోంద‌ని స‌మాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను‌తో చేస్తున్న సినిమాలో క్రేజ్‌లేని అంజలి, శ్రియను తీసుకోవాలనే నిర్ణయానికి దాదాపు వచ్చినట్టు సమాచారం. మ‌రోవైపు మరోవైపు వెంకటేష్ తమిళంలో హిట్టైన ‘అసురన్’ సినిమా తెలుగు రీమేక్ ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీనియ‌ర్ హీరోయిన్ ప్రియమణిని క‌థానాయిక‌గా తీసుకున్నారు. ఇక  నాగార్జున హీరోగా సాల్మన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘వైల్డ్ ‌డాగ్’ సినిమాలో హీరోయిన్ అవసరం లేని సస్పెన్స్ థ్రిల్లర్. ఏదో హీరోకు భార్య పాత్రలో అసలు హీరోయిన్‌గా అందరు మరిచిపోయిన దియా మీర్జాను ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: