జయా బచ్చన్... ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోయినా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అర్ధాంగిగా అలాగే అభిషేక్ బచ్చన్ తల్లి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు జయాబచ్చన్ డబ్భై రెండవ సంవత్సర పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నిజానికి అమితా బచ్చన్ భార్య అయిన ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపును బాలీవుడ్ లో తెచ్చుకున్నారు. అలాగే తన తనయుడు అభిషేక్ బచ్చన్ ఎదుగుదలలో తన తల్లి పాత్ర ఎంతగానో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్ తన ప్రేమ వివాహం చేసుకోవడంలో ఆమె ఎంతో సహకారం అందించింది.

 


ఇదిలా ఉండగా ఈ రోజు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా చెబుతూ పిల్లలంతా ఎంతో ప్రేమగా పలికే పదం అమ్మ అలాంటి మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన తల్లి పట్ల ఉన్న ప్రేమను తెలిపాడు. ఇలా సోషల్ మీడియా ద్వారా చెప్పడానికి కారణం... లాక్ డౌన్ సమయంలో ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆమె అక్కడ ఉండడంతో అభిషేక్ బచ్చన్ తన తల్లిని కలవలేకపోయారు. దీనితో ఆయన సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా మేమంతా నీ గురించి ఆలోచిస్తూ ఉండటం మా గుండెల్లో నువ్వు ఎప్పటికి ఉంటావు ఐ లవ్ యూ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు.

 


ఏది ఏమైనా సరే ఎవరి తల్లి మీద వారి ప్రేమ అనంతం. ప్రపంచంలో ఏదైనా సరే తన తల్లి తర్వాతే అని ప్రతి ఒక్క మనిషి అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముందరి తరుపున జయా బచ్చన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: