బాహుబలి ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళిసినిమా ద్వారా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేసాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాకి బాలీవుడ్ లో నీరాజనాలు పట్టారంటే, అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బాహుబలి ఇచ్చిన బలంతో తెలుగులో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం ఊపందుకుంది.

 


సైరా నరసింహారెడ్డి సినిమాని లార్జ్ స్కేల్ లో తెరకెక్కించడానికి బాహుబలి ఇచ్చిన స్ఫూర్తే కారణమని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన సైరా తెలుగులో మినహా ఇతర భాషల్లో హిట్ అనిపించుకోలేదు. దాంతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తగ్గుతాయేమో అన్న అనుమానం కలిగింది. కానీ ఇప్పుడు అవి మరింత పెరిగాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది.

 

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ, సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందట. దీంతో ఎంతో కాలంగా పాన్ ఇండియా మూవీ తీద్దామనుకున్న అల్లు అర్జున్ కల పుష్పతో నెరవేరనుంది.

 

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ హీరోగ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ హిందీమ్ తెలుగు బైలింగువల్ ఉండనుందని సమాచారం. డార్లింగ్ ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ నాలుగు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే వారంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోయినట్టే. ప్రభాస్ కి ఎలాగూ నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. మరి పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో వస్తున్న వీరు, ప్రభాస్ లా నేషనల్ స్టార్ అనిపించుకుంటారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: