ప్రపంచాన్ని ఇప్పుడు భయంతో వణికిస్తున్న కరోనా రోజు రోజుకీ తన ప్రభావం పెంచుకుంటూ పోతుంది.  అయితే దేశంలో కరోనా ని సమూలంగా అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ సందర్భంగా జనాలు బయటకు రాకుండా పోలీసలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రతి ఒక్కరూ కితాబు ఇస్తున్నారు.  మొన్నటి తెలంగాణ సీఎం కేసీఆర్ డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు. 

 

 

కొన్ని చోట్ల పోలీసులకు పుష్ఫాలతో స్వాగతం పలుకుతున్నారు.  వారి ప్రాణాలు ఫణంగా పెట్టి దేశంలో కరోనా నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి పోలీస్ కి శిరస్సు వంచి దండం పెట్టాలని రాజకీ, సినీ సెలబ్రెటీలు కోరుతున్నారను.  తాజాగా సూపర్ సార్ట్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని కితాబిచ్చాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని సమూలంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని.. అందుకు లాక్ డౌన్ ని సీరియస్ గా పాటించాలని.. ఇందుకో పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు..వారిని పదే పదే ఇబ్బందులకు గురి చేయొవొద్దు అని అన్నారు. 

 

కరోనా యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని... దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు.  అంతే కాదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలు షేర్ చేశాడు.  దేశంలో లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి కొంత మంది ఆకతాయిలు మాత్రం ఉల్లంఘన చేస్తూనే ఉన్నారు.  అయితే పోలీసులు వారిని కట్టడి చేస్తూనే ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: