సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎంత కామ‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లిళ్లు చేసుకున్న వారు విడిపోవ‌డం.. మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం.. హీరోయిన్లు ఒక‌సారి పెళ్లి అయిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం చాలా కామ‌న్‌. తాజాగా ఈ జాబితాలో ఓ హీరోయిన్ చేరిపోయింది. తెలుగులో అప్పుడెప్పుడో 2004లో వ‌చ్చిన 10th క్లాస్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రియం అయ్యింది సునైన‌. ఆ సినిమాలో ఆమె చేయ‌డ‌మే ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యింది. ఆ సినిమాలో పాట‌లు ఇప్ప‌ట‌కీ తెలుగు శ్రోత‌ల నోళ్ల‌లో నానుతూనే ఉంటాయి.

 

సినిమా వ‌చ్చి ఇప్ప‌ట‌కీ ఏకంగా 16 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల త‌ర్వాత సునైన పెళ్లికి రెడీ అవుతోంది. అది కూడా ఓ హీరోకు రెండో భార్య అవ్వడానికి సిద్ధపడుతుంది. సునైన హీరోయిన్‌గా తెలుగులో పెద్ద స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ కూడా ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. అయితే ఈ క్ర‌మంలోనే ఆమె  హీరో కులశేకరన్ తో ప్రేమలో పడింది. కులశేకరన్ కు అప్పటికే పెళ్లయింది. కాకపోతే ఆమెకు విడాకులు ఇచ్చాడు.

 

సునైన - కులశేకరన్ ప్రేమ వ్యవహారం సునైన కుటుంబ సభ్యుల‌కు న‌చ్చ‌లేదు. అదేంటి పెళ్ల‌యిన వాడితో ప్రేమేంటి.. ప్రేమా లేదు.. దోమా లేదు.. మేం చెప్పిన వాడిని పెళ్లి చేసుకోమ‌ని చెప్పి చూశారు. సునైన విన‌లేదు. ఇక త‌ప కుటుంబ స‌భ్యుల‌కు  నచ్చజెప్పి  కుల‌శేక‌ర‌న్‌తో పెళ్లికి సిద్ధమైంది. వాస్తవానికి ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నట్లు తమిళ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: