బ్లాక్ బస్టర్ తో సూపర్ ఎనర్జీ వస్తుంది. అలాగే అంచనాల బరువు పెరుగుతుంది. ఈ వెయిట్ ని మేనేజ్ చేయాలంటే రకరకాల జానర్స్ లోకి వెళ్లాలి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా ఇలాగే ట్రై చేస్తున్నాడు. ఓ వైపు యాక్షన్, మరోవైపు మాస్, ఇంకోవైపు ఫ్యామిలీ స్టోరీస్ అంటూ రకరకాల కథల్లోకి వెళ్తున్నాడు రామ్. 

 

ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు రామ్. అప్పటి వరకు చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో మెప్పించిన రామ్, ఈ సినిమాలో నాటుకోడిలా కనిపించాడు. హైదరాబాదీ కుర్రాడిగా కొత్త అవతారం చూపించాడు. ఈ ట్రాన్స్ ఫర్ మేషన్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ డబుల్ ధిమాక్ యాక్షన్ కు బాక్సాఫీస్ కూడా మురిసిపోయి, 70కోట్లకు పైగా కట్టబెట్టింది. 

 

ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునేందుకు యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రామ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నాడు. తమిళ హిట్ తడమ్ రీమేక్ గా రూపొందుతోంది ఈ చిత్రం. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో మేకు పోస్ట్ పోన్ అవుతోందని సమాచారం. 

 

రామ్ రెడ్ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డిస్కషన్స్ పూర్తయ్యాయనీ త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి సమాచారం వస్తోంది. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకునే మారుతీ, ఇస్మార్ట్ శంకర్ తో ఓ కుటుంబ కథా చిత్రం తియ్యబోతున్నాడని చెబుతున్నారు. 

 

రామ్ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడట. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో మెప్పించే సుకుమార్, రామ్ తో ఓ మాస్ మూవీ తీస్తాడని టాక్ వస్తోంది. ఇంతకుముందు వీళ్లద్దరి కాంబినేషన్ లో జగడం అనే సినిమా వచ్చింది. మాఫియా టచ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: