టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు నిర్మాతల మధ్య విభేదాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. టాలీవుడ్ లో కొందరు దర్శకుల విషయంలో నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు మాత్రం కొందరిని కలవరానికి గురి చేస్తున్నాయి. టాలీవుడ్ లో ఒక ప్రముఖ దర్శకుడి తో సినిమా చేయడానికి మూడేళ్ళు గా ఒక నిర్మాత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి ఒక చిన్న నిర్మాత అడ్డు పడ్డారని సమాచారం. 

 

ఆ నిర్మాతతో సినిమా చేయనివ్వకుండా అడ్డు పడి ఇప్పుడు అతన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు నిర్మాతలు రెండు వర్గాలు గా ఉన్నారని సమాచారం. స్టార్ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు తమను తోక్కేస్తున్నారు అనే భావనలో కూడా చిన్న నిర్మాతలు ఉన్నారు. తమకు అవకాశాలు ఇవ్వాలని హీరోలు భావించినా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయనివ్వకుండా చూస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. హీరోలకు ఆసక్తి ఉన్నా దర్శకులు ముందుకి వచ్చినా సరే చేయనివడం లేదట. 

 

నిర్మాతల మండలి నుంచి కొందరు నిర్మాతలు బయటకు వచ్చే ఆలోచన లో ఉన్నారట కొందరు నిర్మాతలు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొందరు నిర్మాతలు అయితే సినిమాల నుంచి బయటకు వెళ్లి వ్యాపారాలు కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నాయి. కొందరు నిర్మాతలు అయితే ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను పైకి రానీయడం లేదు అనే భావనలో ఉన్నారట వాళ్ళు. హీరోలు కూడా ఇప్పుడు కొందరు నిర్మాతల విషయంలో ఇప్పుడు అసహనంగానే ఉన్నారని తెలుస్తుంది. దీనిపై ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి సిని పెద్దలకు అంటున్నారు. రాజమౌళి తో సినిమా చేసే విషయంలో కొందరు నిర్మాతల మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: