టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరో, హీరోయిన్లు సోషల్ మాద్యమాల్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటున్నారు.  చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ మద్య సోషల్ మాద్యమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడి ఫొటో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలు తెలిపిన సంగతి విదితమే. 1962లో నాకు  ఓ లాటరిలో ఈ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర ఎంతో భద్రంగా దాచుకుంటున్నానని అన్నారు.

 

దీని వెనుక మరో కథ ఉంది.. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు ఆ కనుబొమ్మలు, కళ్లు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయన్నారు' అని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి తన ఫొటోను కూడా చిరు పోస్ట్ చేశారు. తాజాగా దీనిపై స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్నయ్య చిరంజీవి ఆంజనేయుడికి పరమ భక్తుడు.. అప్పట్లో ఆయన తీసుకు వచ్చిన ఫోటో చూసిన తర్వాత అందరం ఆ స్వామికి భక్తులం అయ్యాం.. పూజించడం మొదలు పెట్టాం.

 

అయితే నాన్నగారు విప్లవ భావజాలం ఉన్నవారు.. ఆయనని కూడా అన్నయ్య భక్తి మార్చింది. నా టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హనుమంతుడి చాలీసాను 108 సార్లు అప్పుడప్పుడు చదివేవాడిని. జై హనుమాన్' అని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పెద్దన్నయ్య చేసిన ఆ ట్వీట్‌ను పవన్ రీట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: