కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం అదే ఊపుతో నటిస్తున్న తాజా సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నలభై శాతానికి పైగా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మిరోస్ల కూబా ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇకపోతే నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు యూనిట్ సభ్యులు. అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం, జుట్టు పెంచుకుని మాస్ స్టైల్ లో ఉన్న ఆ పోస్టర్ నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ పోస్టర్ నేడు ఒక సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ల లో సోషల్ మీడియా మధ్యమం ట్విట్టర్ లో 88.6 కె లైక్స్ తో అత్యధిక లైక్స్ అందుకున్న పోస్టర్ గా పుష్ప పోస్టర్ రికార్డుల కెక్కింది. 

 

ముందుగా శేషాచలం అడవుల్లో ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ ని ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సహా మరొక ఇద్దరు నటులు విలన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ కూడా పక్కాగా మాస్ స్టైల్ లో సాగుతుందని, అలానే సినిమా మొత్తం మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ప్రస్తుతం పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో రికార్డు సాధించడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: