టాలీవుడ్ హీరోలు ఈ మధ్య కాలం లో సహాయం చేయడానికి ఎక్కువగా ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు ఉన్నా లేకపోయినా సరే తమను జనాలు ఆదరిస్తున్న నేపధ్యం లో వారి కోసం ఏదొకటి చెయ్యాలి అనే భావనలో హీరోలు అందరూ కూడా ఉన్నారు. ఈ మధ్య హీరోల కు కాస్త క్రేజ్ ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే వాళ్ళు కూడా అభిమానులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని ఫాన్స్ ఈ మధ్య ఎక్కువగా పట్టించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మన హీరోలు. ఇప్పుడు కరోనా సాయం విషయంలో మన హీరోలు ఎంత ముందుకి వస్తే అంత మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. హీరోలు సహాయం చేయకపోతే మాత్రం వాళ్ళను ప్రజలు ఆదరించే అవకాశం ఉండదు. అందుకే హీరోలు అందరూ కూడా తమ తమ సొంత జిల్లాల్లో ఎక్కువగా గ్రామాలను దత్తత తీసుకోవాలని లేదా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్ధిక సహాయం తో పాటుగా అన్ని విధాలుగా అండగా నిలవాలి అని భావిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. 

 

ఈ ఆలోచన చిరంజీవి చేసారని టాక్. సినిమాల ను ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం మనకు ఉందని కూలి పనులకు వెళ్ళే వారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు వారికి భారీగా సహాయం చేయడం లేదా పిల్లలకు ఫీకులు కట్టడం చెయ్యాలని చూస్తున్నారు. చిరంజీవి మెగా హీరోలకు ఇప్పటికే ఈ బాధ్యతను అప్పగించారని సమాచారం. హీరోలు అందరూ కూడా ఇప్పటికే దీని మీద ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. త్వరలోనే ఈ సాయం విషయంలో ముందుకి వెళ్లాలని చూస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: