అత్తా కోడ‌ళ్ళు అంటే ఎప్పుడు చూసినా ఒక‌రినొక‌రు తిట్టుకుంటుంటారు. గొడ‌వ‌లు ప‌డుతుంటారు అని అంద‌రూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి రోజుల్లో...కానీ ఇప్పుడు అలా లేదు. కోడ‌లు అత్త‌ను అమ్మ‌లా చూసుకుంటున్నారు. మెట్టినింటిని కూడా పుట్టినిల్లులా చేసేసుకుంటున్నారు. అల‌సు ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే కొంత మంది సెల‌బ్రెటీలు వాళ్ళ అత్త‌ల గురించి ఏమి చెబుతున్నారో ఓసారి చూద్దాం.

 

ఘ‌ట్ట‌మ‌నేని న‌మ్ర‌త టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భార్య‌. న‌మ్ర‌త త‌న అత్త ఇంద్రాదేవి గురించి మాట్లాడుతూ...మ‌హేష్‌తో వివాహం జ‌రిగిన‌ప్పుడు ఆమె ఫామ్‌లోనే ఉంది. కానీ న‌టిగా సినిమాల్లో రాణించాలా లేక ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాలా అనేది అత్తారింట్లో అడుగు పెట్టేవ‌ర‌కు డిసైడ్ చేసుకోలేద‌ట‌. ఎప్పుడూ కుటుంబ స‌భ్యుల‌తో క‌ళక‌ళ‌లాడుతూ ఉండే కృష్ణ‌గారి ఇల్లు చూస్తే ఇంటిని చ‌క్క‌బెడుతూ ఇల్లాలిగానే ఉండిపోవాలి అనిపించింది. తెలుగు స‌రిగా రాక మొద‌ట్లో చాలా ఇబ్బందిప‌డేద‌ట‌. అత్త‌య్య ఇంద్రాదేవితో స‌రిగా మాట్లాడ‌లేక‌పోయేద‌ట‌. మా అత్త‌గారి కోస‌మే తెలుగు త్వ‌ర‌గా నేర్చుకున్నాను. ఆ విష‌యంలో మా అత్త‌గారు కూడా చాలా హెల్ప్ చేశారు అంటుంది న‌మ్ర‌త‌. అలాగే మ‌హేష్‌ని అర్ధం చేసుకుని త‌న‌ని బాగా చూసుకునే కోడ‌లు రావాల‌ని ఇంద్ర‌దేవిగారు ఎప్పుడూ అనుకునేవార‌ట‌. ఇక వాళ్ళ వివాహం జ‌రిగిన కొద్ది రోజుల్లోనే నేను ఎలాంటి అమ్మాయిని అయితే కోడ‌లిగా రావాల‌ని కోరుకున్నానో నువ్వు అలాంటి అమ్మాయివే అని అన‌డంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింద‌ట‌. ఇక తెలుగింటి సాంప్ర‌దాయాలు పూజ‌లు గురించి పెళ్ళైన కొత్త‌లో పెద్ద‌గా తెలియ‌దు. 

 

ఇక మ‌హేష్ కుటుంబంలో సాంప్ర‌దాయాల‌కు ఎంత‌గానో విలువ ఇస్తారు. పండ‌గ అంటే వారం రోజుల పాటు ఇంట్లో సంద‌డిగా ఉంటుంది. అవ‌న్నీ నాకు కొత్త‌గా అనిపించేవి. ఇక మ‌హేష్‌ని అడిగి తెలుసుకుందామంటే ఎప్పుడూ షూటింగ్‌ల‌తో బిజీగా ఉండేవాడు. దాంతో కుటుంబ స‌భ్యులు కూడా న‌న్ను ఏద‌న్నా అడ‌గాలంటేకాస్త బెరుకుగా ఉండేవారు. అప్పుడు అత్త‌య్యే అర్ధం చేసుకుని మ‌హేష్‌కి ఇష్ట‌మైన వంట‌కాల‌న్నీద‌గ్గ‌రుండి నేర్పించారు. ఆవిడ అవ‌న్నీ నేర్పించ‌డంతో నేను నా పిల్ల‌ల‌కి అవ‌న్నీ వండి పెట్ట‌గ‌లుగుతున్నాను. అలాగే నేను అత్త‌య్య‌ని చూసి నేర్చుకున్న‌వి చాలానే ఉన్నాయి. ఆమె చాలా సింపుల్‌గా నిరాడంభ‌రంగా ఉంటారు. ఇంటికి ఎవ‌రైనా వ‌స్తే భోజ‌నం పెట్ట‌కుండా పంపించ‌రు. మ‌ర్యాద‌లు మాత్రం త‌న‌త‌ర్వాతే ఎవ‌రైనా అనిపిస్తుంది. ఈ వ‌య‌సులో కూడా ఆమె ఎంతో చురుకుగా ఉంటారు. త‌క్కువ‌గా మాట్లాడే అత్త‌య్య‌ది చాలా పాజిటివ్ నేచ‌ర్‌. ఎవ‌రినీ నొప్పించ‌రు. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా స‌ర్దుకుని పోతారు. ఇలా చెప్పుకుంటూపోతే అత్త‌య్య‌ని చూసి ఎన్నో నేర్చుకోవాలి. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మా అమ్మ‌స్థానాన్ని భ‌ర్తీ చేశారు ఆమె. నా పెళ్ళైన కొత్త‌లోనే అమ్మానాన్న ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోయారు. అప్పుడు నేను కాస్త డిప్ర‌ష‌న్‌కి వెళితే అత్త‌య్యే ద‌గ్గ‌రుండి నాకు కావ‌ల‌సిన‌వ‌న్నీ చూసుకున్నారు. ఇక న‌న్ను కోడ‌లిగా కాకుండా కూతురులా చూసుకుంటారు. ఈ విష‌యంలో అంద‌రూ నువ్వు ఎంతో ల‌క్కీ అంటుంటారు మా ఆడ‌ప‌డుచులు. సితార సేమ్‌ మా అత్త‌య్య‌లాగా మాట్లాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: