సినీ ఇండస్ట్రీలో అభిమానుల మధ్య గొడవలు ఎప్పుడు ఉండేవే. ఇక మన టాలీవుడ్ లో అయితే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు ఇతర మెగా హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ గొడవే. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. మెగా అభిమానుల్లో అంత‌ర్గ‌తంగా కొన్ని వ‌ర్గాలు ఏర్ప‌డ‌టం, విధ్వేషాలు న‌డుస్తుండ‌టం వాస్త‌వం. త‌న ఎదుగుద‌ల‌లో చిరంజీవి పాత్ర ఎంతో బ‌న్నీ గ‌తంలో ఎన్నోసార్లు చెప్పుకున్నా స‌రే.. అత‌డికి ఈ మ‌ధ్య బాగా కొమ్ములు వ‌చ్చేశాయ‌ని.. చిరంజీవినే లెక్క చేయ‌డం లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తేలిగ్గా తీసిప‌డేస్తున్నాడ‌ని మెగా అభిమానుల్లో ఓ వ‌ర్గం విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. బ‌న్నీ మీద చిరు అభిమానులు ఏ స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్నారో ట్విట్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ పై ఫ్యాన్స్ అడిగే దాకా బన్నీ స్పందించకపోవడం, పవన్ కళ్యాణ్ తనయుడికి విషెస్ చెప్పకపోవడం వల్ల మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు.

 

చిరంజీవి విష్‌కు బ‌దులుగా బ‌న్నీ పెట్టిన ట్వీట్ కింద కామెంట్లు చ‌దివితే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. అస‌లే త‌న‌ మీద ఓ వ‌ర్గం మెగా అభిమానులు ఆగ్ర‌హంతో ఉండ‌గా.. వాళ్ల ఆగ్ర‌హాన్ని ఇంకా పెంచేలా వ్య‌వ‌హ‌రించాడు అల్లు అర్జున్. ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ అల్లు అర్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ అత‌ణ్ని మెగాస్టార్‌గా అభివర్ణించింది. దీనికి బ‌దులుగా బ‌న్నీ థ్యాంక్స్ చెప్పాడు. శ్రేయా మెసేజ్ చ‌దివి బ‌దులిచ్చిన బ‌న్నీ.. త‌న‌ను మెగాస్టార్ అని పిల‌వొద్ద‌ని, చిరుకు మాత్ర‌మే అది సొంత‌మ‌ని ఆమెకు చెప్ప‌కపోవ‌డాన్ని మెగా అభిమానులు త‌ప్పుబ‌డుతున్నారు. బ‌న్నీ శ్రేయాకు బ‌దులివ్వ‌క‌పోతే మెసేజ్ చ‌ద‌వ‌లేద‌నుకోవ‌చ్చు కానీ.. రిప్లై ఇవ్వ‌డంతో త‌న‌ను తాను మెగాస్టార్‌గా భావిస్తున్నాడంటూ మండిప‌డుతున్నారు చిరు ఫ్యాన్స్. శ్రేయా మాత్ర‌మే కాదు.. క్రికెట‌ర్ రాహుల్ శ‌ర్మ‌తో పాటు కొంద‌రు ఉత్త‌రాది జ‌నాలు బ‌న్నీని మెగాస్టార్‌గా అభివ‌ర్ణిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మరి ఈ ఫ్యాన్స్ వార్ కి ఎప్పుడు ఫులుస్టాప్ పడుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: