మరణం మనిషికి ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం.. ఇప్పటికే కరోనాతో ప్రపంచ ఖాళీ అవుతుంటే.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో రోడ్లపైన యాక్సిడెంట్లు తగ్గాయి.. అయినా కానీ ఏదో ఒక రూపకంగా మనషుల ప్రాణాలను మృత్యువు తీసుకుపోతూనే ఉంది.. ఇలాంటి పరిస్దితుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే వారికి, వారి కుటుంబ సభ్యులకు కలిగే ఇబ్బందులు చెప్పడం కష్టం.. ఇదిలా ఉండగా సినీ నటుడు, కామెడీ విలన్ నర్సింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురవగా ఆయనను ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. కాగా కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు నర్సింగ్‌ యాదవ్‌..

 

 

ఇక విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు ఈ నటుడు పరిచయం అయ్యారు.. అంతే కాకుండా దర్శకుడు రాం గోపాల్ వర్మ, నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు కూడా.. ఇకపోతే 1963 మే 15 న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. ఇతని తల్లిదండ్రుల పేర్లు రాజయ్య, లక్ష్మీ నరసమ్మ.. ఇక  కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా 300 ల‌కు పైగా సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న నర్సింగ్, తెలుగు, హిందీ, త‌మిళ్‌ భాషల్లో న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన భాషాలోనూ మంచి క్యారెక్టర్ చేశారు. ఇదేకాకుండా క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌ జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన క్యారెక్టర్లకు చాలా మంచి పేరు వ‌చ్చింది.

 

 

అదీగాక చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెంబ‌ర్ 150’లోనూ న‌టించారు. కొన్ని ఆనారోగ్యసమస్యలతో సతమతం అవుతున్న నర్సింగ్ యాదవ్.. గ‌త కొంత‌కాలంగా డ‌యాలిసిస్ చికిత్స తీసుకుంటున్నారట. ఇకపోతే గురువారం ఇంట్లో తెల్లవారు జామున కింద పడిపోయిన నర్సింగ్ యాదవ్‌ను వెంటనే య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించారట అతని కుటుంబ సభ్యులు. ఇక కింద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయట. అయితే ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు...  

 

మరింత సమాచారం తెలుసుకోండి: