రెండేళ్ల క్రితం కన్నడ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై పాన్ ఇండియా ఫీల్ తో ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఈ సినిమా కన్నడ తో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అయి, అన్ని భాషల్లోనూ అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో అత్యద్భుతమైన కథ, కథనాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని రూపొందించడం జరిగింది. హీరోగా యాష్ అద్భుత నటన, అదరగొట్టే భారీ సెట్టింగులు, యాక్షన్ సీన్స్, ఫైట్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా విజయానికి కీలకంగా నిలిచాయి. 

 

ఇక గత సంవత్సరం కాలం నుండి ఈ సినిమాకు సీక్వెల్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 ని మరింతగా భారీ నిర్మిస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ తాజా పార్ట్ లో విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా, మరొక బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ప్రధానమంత్రి రమిక సేన్ గా నటిస్తోంది. మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి రావు రమేష్ మరొక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మిగతా తారాగణం అంతా మొదటి చాప్టర్ లో నటిస్తున్నవారేనట. ఇకపోతే చాప్టర్ 1 తో పోలిస్తే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల కళ్ళు చెదిరే రేంజ్ లో ఉంటాయని, ఇక ఇందులో మొత్తం ముగ్గురు విలన్లు ఉన్నప్పటికీ అధీరానే మెయిన్ విలన్ అని అంటున్నారు. రాబోయే అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబందించిన షాకింగ్ న్యూస్ ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ చాప్టర్ 2 లో క్లైమాక్స్ సీన్ లో హీరో చనిపోతాడని సమాచారం. 

 

ఎంతో ఎమోషనల్ గా సాగే ఆ సీన్, మొత్తం సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఆ విషయం అటుంచితే, సాధారణంగా మన తెలుగు సహా చాలా భాషల్లో సాడ్ ఎండింగ్స్ అనేవి వర్కౌట్ కావని, అదీకాక ఎంతో భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న కెజిఎఫ్ మాదిరి సినిమాల్లో అయితే హీరో చనిపోవడం ప్రేక్షకులు జీర్ణించుకోలేరని, కాబట్టి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం సినిమాలో హీరో నిజంగానే చనిపోతే మాత్రం, అది సినిమాకు చాలావరకు మైనస్ గా మారడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతరవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: