ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్, మార్కెట్ తో పాటు అత్యద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు సాగుతున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముందు వరసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. వాస్తవానికి ప్రభాస్ కంటే ముందుగా సినిమాల్లోకి ప్రవేశించిన మహేష్ బాబు, ముందుగా రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి మహేష్ అప్పటికే ఆరు సినిమాలు చేసి ఉన్నారు. ఇక ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తరువాత వర్షం సినిమాతో హీరోగా పెద్ద హిట్ కొట్టారు. ఇక మహేష్ కూడా ఒక్కడు సూపర్ హిట్ తరువాత తన రేంజ్ మరింతగా పెంచుకున్నారు. 

 

ఆపై ఈ ఇద్దరు హీరోలు కూడా వరుసగా చేస్తున్న సినిమాలతో మెల్లగా తమ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు క్రేజ్, మార్కెట్ రేంజ్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఎక్కువగా యువతలో ఈ ఇద్దరు హీరోలకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా నైజాం, ఆంధ్ర, ఓవర్సీస్ ఏరియాల్లో ఈ ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉండగా ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో ప్రభాస్ తన మార్కెట్ రేంజ్ ని మరింతగా పెంచుకున్నారు. అయితే మహేష్ కూడా మంచి పాన్ ఇండియా మూవీ కోసం చూస్తున్నారు. 

 

ఎప్పుడు మొదలవుతుందో తెలియదుకాని, మహేష్ తో నా సినిమా తప్పకుండా ఉంటుందని, అలానే ఆ సినిమా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఉంటుందని ఇటీవల రాజమౌళి కూడా చెప్పడం జరిగింది. దాని అనంతరం మహేష్ మార్కెట్ రేంజ్ కూడా మరింతగా పెరగవచ్చని తెలుస్తుంది. ఇక స్వతహాగా మంచి ఒడ్డు, పొడుగు కలిగిన ఈ ఇద్దరు హీరోలు ఇటీవల విడివిడిగా దిగిన రెండు ఫోటోలను ఒకటిగా జత చేసి, దానిని బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ కి కన్వర్ట్ చేసి కొందరు ఆ ఫోటోని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. కాగా ప్రభాస్, మహేష్ ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండగా, అబ్బా ఈ ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కూడా అదరగొట్టారబ్బా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: