మన టాలీవుడ్ నుండి ఇప్పటికే బాహుబలి, సైరా, సాహూ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలై హిట్ కొట్టేశాయ్.. అయితే ఇప్పుడు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు త్వరలోనే తెరపైకి రానున్నాయి.. ఆ టాలీవుడ్ సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఆర్ఆర్ఆర్.. 

 

సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పటికప్పుడు అద్భుతమైన సినిమాలు తియ్యడంలో రాజమౌళికి ఎవరు సాటిరారు.. ఇంకా అలాంటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.. మరి ఈ సినిమా ఏలాంటి రికార్డ్స్ తిరగరాస్తుందో చూడాలి.  

 

ప్రభాస్ 20.. 

 

సాహూ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇప్పటి వరుకు పేరు ప్రకటించలేదు.. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. 

 

పుష్ప..

 

సినిమా పేరు వింటుంటేనే వెరైటీగా ఉంది... సూపర్ కాంబినేషన్ అయినా సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాను చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ అని ప్రకటించేశారు కూడా.. మరి ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి. 

 

పవన్ కళ్యాణ్ 27.. 

 

పవన్ కళ్యాణ్ - క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఇప్పటి వరుకు అప్డేట్ లేదు. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజమెంత అనేది తెలియాలి. 

 

ఫైటర్.. 

 

విజయదేవర్ కొండకు.. పూరి జగన్నాథ్ కు ఇద్దరకు ఇది మొదటి పాన్ ఇండియా ఫిలిం.. ఎన్నో ప్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్న విజయ్ తో ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా హిట్.. ప్లాప్ పై వీరి ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయ్. 

 

అహం బ్రహ్మాస్మి.. 

 

మంచు మనోజ్ చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ లో నటిస్తున్నారు.. అహం బ్రహ్మాస్మి అంటూ తేరా ముందుకు వస్తున్నారు.. మరి ఈ సినిమాతో మంచు మనోజ్ కెరీర్ మెట్టు ఎక్కుతుందా లేదా అనేది చూడాలి. 

 

మేజర్.. 

 

ఎప్పుడు కథను నమ్మొకొని సినిమా తీసే అడవి శేష్ ఇప్పుడు ఓ పాన్ ఇండియా ఫిల్మ్ ని తియ్యబోతున్నాడు.. నిజం చెప్పాలి అంటే రాజమౌళి తర్వాత ప్రతి సినిమా మంచి హిట్ కొట్టగలిగే సత్తా అడవి శేష్ కి ఉందని చెప్పచ్చు.. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. 

 

ఏమైతేనేం.. ఏడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.. మరి సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: