టాలీవుడ్ జనం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఈ సినిమా విషయంలో ఏ వార్త వచ్చినా సరే టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా వింటుంది. ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారా అని అందరికి ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో రాజమౌళీ ఏ స్పష్టతకు రాలేకపోతున్నారని అంటున్నారు. వాస్తవానికి లాక్ డౌన్ ఎత్తేస్తే ఆయన కొన్ని సీన్స్ షూట్ చేద్దాం అని చూసారు. 

 

కాని లాక్ డౌన్ ని దాదాపుగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరికి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రకటించిన తేదీ కి రాజమౌళి ఫాన్స్ ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ సమయంలో కూడా ఈ సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8 గానే ప్రకటించింది చిత్ర యూనిట్.దీనితో అసలు ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. 

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో దాదాపు 80 శాతం వరకు పూర్తి అయింది కూడా. ఈ సినిమాను ఎలా అయినా సరే అనుకున్న తేదీ కి ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలి అనే పట్టుధలతోనే రాజమౌళి ఉన్నాడని అర్ధమవుతుంది. కాని కొన్ని పరిస్థితుల కారణంగా విడుదల తేదీ వాయిదా పడటం ఖాయమని అంటున్నారు. వచ్చే ఏడాది మే లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు టాలీవుడ్ లో ప్రచారం ఎక్కువగా జరుగుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: