బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి టాలీవుడ్ లో ఏ స్థాయిలో క్రేజ్ పెరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. అతని సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గత పదేళ్ళలో ప్రభాస్ చేసిన సినిమాలు కేవలం నాలుగు మాత్రమే. బాహుబలి సినిమా కోసం అతను దాదాపు ఆరేళ్ళ పాటు సమయ౦ కేటాయించి మరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా చేసినన్ని రోజులు కూడా మరో సినిమా మీద అతను అసలు దృష్టి కూడా పెట్టలేదు. ఆ తర్వాత సాహో కి ఓకే చేసాడు గాని అప్పటి వరకు మాత్రం ఏ విధంగాను మరో సినిమా కథ వినలేదు. 

 

ఇది పక్కన పెడితే సాహో సినిమా తర్వాత అతను రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్సినిమా చేసే అవకాశం ఉంది అనేది స్పష్టత మాత్రం రావడం లేదు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ కచ్చితంగా గ్యాప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకుని అప్పుడు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతని సినిమాలు అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. 

 

దాన్ని కూడా పక్కన పెట్టి ప్రభాస్ ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటూ కూడా సినిమాలు చేయవచ్చు. కాని పెళ్లి కోసం విదేశాలకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా విషయంలో అతను ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని రెండు మూడేళ్ళ తర్వాత అతను సినిమాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు. మరి ఉంటాడో మానేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: