అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ని రివీల్ చేశారు. పుష్ప అనే విచిత్ర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. లారి డ్రైవర్ పాత్రని పోషిస్తున్న బన్నీ లుక్ అచ్చు గుద్దినట్లు అలానే డిజైన్ చేశారు. సినిమా సినిమాకి లుక్ పట్ల ఎంతో శ్రద్ధ వహించే బన్నీ డెడికేషన్ పుష్ప లుక్ తో అర్థం అయిపోయింది.

 

అయితే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. గత కొన్ని రోజులుగా తెలుగు హీరోలందరికీ పాన్ ఇండియా మీద దృష్టి పడింది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో ప్రతీ ఒక్కరూ అడుగు ముందుకు వేస్తున్నారు. అర్జున్ రెడ్డితో బాలీవుడ్ లోనూ క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ఫైటర్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే రూపుదిద్దుకుంటోంది.

 

ఇక ఎప్పటి నుండో పాన్ ఇండియా చిత్రాన్ని తీయాలని చూస్తున్న బన్నీ, పుష్ప సినిమాతో ఆ ప్రయత్నమ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ తోనే ఆ సంకేతాలు అందించాడు. బన్నీకి తెలుగుతో పాటు మళయాలంలో మంచి క్రేజ్ ఉంది. బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకి యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. కన్నడ, తమిళంలో తెలుగు హీరోలకి ఎంతో కొంత మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే.

 

అయితే దాదాపు  అందరూ హీరోలు పాన్ ఇండియా రేంజ్ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో ఎప్పుడు సినిమా తీస్తారని మహేష్ ని ఎప్పటి నుండో అడుగుతున్నారు. దానికి మహేష్ ఇప్పట్లో ఉండదని చెప్తూ వస్తున్నాడు. ఇక బాలీవుడ్ ని పక్కన పెట్టి డైరెక్ట్ గా పాన్ ఇండియా సినిమా తీస్తేనే బెటర్ అని అంటున్నారు. మరి మహేష్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: