టాలీవుడ్ టాప్ హీరోలలో అక్కినేని నాగార్జునది డిఫరెంట్ స్టైల్. కెరీర్ స్టార్టింగ్ నుండి సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెనుక పరుగులు తీయకుండా కొత్త డైరెక్టర్లతో సినిమాలను తీస్తూ ఇండీస్ట్రీకి న్యూ టాలెంటుని పరిచయం చేస్తూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ, వైవీయస్ చౌదరి, దశరథ్, రాఘవ లారెన్స్, కిరణ్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమాతో సోలొమాన్ అనే మరో కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే ఆయన్ని ఇండస్ట్రీలో 'కింగ్' నాగార్జునగా పిలుస్తుంటారు. సాధారణంగా నాగార్జునకి ఎవరైనా దర్శకులు నచ్చితే వారిని తన ఇంట్లో బంధువుగా ట్రీట్ చేస్తాడు. మంచి సినిమా తీస్తే సొంత ప్రొడక్షన్ లొనే మరొక సినిమా చేసేందుకు అవకాశం ఇస్తాడు. అక్కినేని హీరోలల్లో ఒక్కరితో వర్క్ చేసినా చాలు నెక్స్ట్ ఆ ఫ్యామిలిలోనే మరొక ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఎంత స్టార్ దర్శకుడు అయినా సరే నాగ్ కి నచ్చకపోతే వెంటనే కోటింగ్ ఇచ్చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అయితే రీసెంట్ గా ఒక దర్శకుడు చేసిన పనికి తీవ్ర ఆగ్రహానికి లోనయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే ఇటీవల 'గీత గోవిందం' దర్శకుడైన పరశురామ్ పట్ల నాగార్జున అసహనానికి గురైనట్లు టాక్. 

 

పరశురామ్ తో కొన్ని వారాల క్రితం నాగ చైతన్య ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ సెట్టయ్యింది అనుకున్న సమయంలో చైతూని కాదని మహేష్ బాబుతో కొత్త సినిమా చేయడానికి అతని చుట్టూ తిరుగుతున్నాడట పరశురామ్. దీంతో నాగార్జునకి అతని తీరు ఏ మాత్రం నచ్చలేదట. అతని కోసం షెడ్యూల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ముందు పూర్తి చెయ్యమని చైతూతో చెప్పినట్లు సమాచారం. ఎవరిని మనం బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదని దర్శకుడి తీరు ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పారట. ఇక పరశురామ్ అయితే మొదట మహేష్ తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మొదట మహేష్ ఒప్పుకోలేదు. దీంతో నాగచైతన్యతో సినిమా మొదలు పెట్టారు. ఆ తరువాత స్క్రిప్ట్ చేంజ్ చేశాక ఇప్పుడు మహేష్ వెంటనే చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడట. అదే దర్శకుడిని కన్ఫ్యూజన్ లో పడేసింది. పరశురామ్ ఏ చిత్రం చేయబోతున్నాడనేది త్వరలోనే తెలుస్తుంది. ఏదేమైనా ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యి మరో పెద్ద ప్రాజెక్ట్ చేతికొచ్చిందని దాన్ని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు కదా అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: