బాలీవుడ్ లో ప్రముఖంగా చెప్పుకునే జంటల్లో సైఫ్ అలీ ఖాన్కరీనా కపూర్ జంట ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ జంట కరోనా పరిస్థితుల వల్ల అందరిలానే ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ టైమ్ బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ తమ తమ ఫ్యామిలీ లైఫ్ ను ఇంట్లో పిల్లలతో, తల్లిదండ్రులతో గడుపుతున్నారు. మరి బెబో ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. కానీ లేటెస్ట్ గా మాత్రం పాత జ్ఞపకాలను నెమరువేసుకుంటోంది. భర్త సైఫ్ తో, కొడుకు తైమూర్ తో కలిసి గతంలో జరిగిన తన వెకేషన్ టైమ్స్ ను గుర్తు చేసుకుంటోంది.

 

 

ఇందుకు ఉదాహరణగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో తన ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్ లో బెబో తనదైన సెక్సీ లుక్ లో ఉంది. ఫారిన్ బీచ్ లో బికినీలో రెడ్ హాట్ గా ఉంది. బెబో పక్కన భర్త సైఫ్ కొడుకు తైమూర్ తో ముద్దులాడుతున్నాడు. కోకోనట్ వాటర్ తాగుతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పిక్ ఇప్పటిది కాదు. అందుకే ఈ కరోనా టైమ్ లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. ‘ఈ సమయంలో నాకు బీచ్ గుర్తు రావడం లేదు. మరి మీకు..’ అంటూ తన వాల్ లో రాసుకుంది కరీనా కపూర్ ఖాన్.

 

 

ఈ పిక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా అంగ్రేజీ మీడియం సినిమా మార్చిలో రిలీజ్ అయి కరోనా వల్ల ఆగిపోయింది. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దాలో నటిస్తోంది. కరీనా కపూర్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించింది. కపూర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, కరిష్మా కపూర్ చెల్లెలుగా అడుగుపెట్టి టాప్ హీరోయిన్ అయిపోయింది.

https://www.apherald.com/Movies/Read/486737/Kareena-getting-flasback-in-corona-time

 

మరింత సమాచారం తెలుసుకోండి: