దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో దర్శకులు. నిర్మాతలు, హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైనప్పటికీ అనుకున్న తేదీకి ఆర్ఆర్ఆర్ విడుదల చేయాలని ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తున్నారు. 
 
దేశంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వేగంగా షూటింగ్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేశంలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే కొన్ని సీన్లను సెట్లు వేసి షూట్ చేయాలని రాజమౌళి యోచిస్తున్నారని తెలుస్తోంది. మొదట్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల సినిమా బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోందని సమాచారం. 
 
ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 450 కోట్ల రూపాయల భారీ తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే మోషన్ టీజర్ విడుదల చేసిన రాజమౌళి మే 20న ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ ను విడుదల చేయనున్నాడని తెలుస్తోంది. జక్కన్న లాక్ డౌన్ సమయంలో కూడా ఇంటి నుండే ఆర్ఆర్ఆర్ సినిమా పనులు పూర్తి చేస్తూ ఉండటం గమనార్హం. 
 
లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోను షెడ్యూల్స్ మిస్ కాకుండా రాజమౌళి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అలియా భట్,  ఒలీవియా  మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: