టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అటు సినీ నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్ గా వరుస విజయాలు అందుకుంటున్న దిల్ రాజు లాక్ డౌన్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు కు అటు తెలంగాణలోను, ఏపీలోని వైజాగ్ లోను సొంతంగా కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లు మాత్రమే కాక వందల సంఖ్యలో థియేటర్లతో దిల్ రాజుకు అగ్రిమెంట్లు ఉన్నాయి. 
 
ఈ థియేటర్లలో దిల్ రాజు నిర్మిస్తున్న, డిస్ట్రిబ్యూషన్ వహిస్తున్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతాయి. వారానికి థియేటర్ ఏరియాను బట్టి, రెంట్ ను బట్టి లక్ష రూపాయలకు అటూఇటుగా దిల్ రాజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని థియేటర్లకు ఇంకా ఎక్కువ మొత్తమే చెల్లించాలి. సినిమా ఆడినా, ఆడకపోయినా దిల్ రాజైనా, మరే ఇతర నిర్మాతైనా ఈ మొత్తాన్ని చెల్లించక తప్పదు. కానీ లాక్ డౌన్ వల్ల అగ్రిమెంట్లలోని షరతుల ప్రకారం దిల్ రాజు రెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. 
 
సాధారణంగా మార్చి నెల నుంచి థియేటర్లకు డల్ సీజన్. పరీక్షల సమయం కావడంతో పెద్ద సినిమాలు విడుదల కావు. చిన్న సినిమాలు విడుదలై హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లను రాబట్టే అవకాశం తక్కువ. సినిమాలకు కలెక్షన్లు ఉన్నా లేకపోయినా వందల థియేటర్లకు దిల్ రాజు రెంట్ చెల్లించాల్సి వచ్చేది. డల్ సీజన్లో లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో దిల్ రాజు కు ఇప్పుడు లక్షల రూపాయలు ఆదా కానున్నాయని తెలుస్తోంది. 
 
మే నెల మొదటి వారం నుంచి సినిమాలకు మంచి సీజన్.  అప్పట్లోపు థియేటర్లు తెరచుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు సినిమాతో నిర్మాతగా, అల వైకుంఠపురములో సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా హిట్లు అందుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా సమంత, శర్వానంద్ కాంబినేషనో తెరకెక్కిన జాను సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తో గట్టెక్కాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: