బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ ఇద్దరినీ  నందమూరి అభిమానులకు రెండు కళ్ళుగా భావిస్తారు. ఈ ఇద్దరూ కలసి నటించాలని కూడా ఫ్యాన్స్ కు  మహా లావు కోరికలు ఉన్నాయి. అయితే అబ్బాయి, బాబాయి నటించడం అన్నది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చునని అంటారు. దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ఓ హాట్ టాపిక్ గా బాలయ్య కొత్త మూవీ  విషయం చర్చకు వస్తోంది.

 

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ  చేస్తున్న సంగతి విధితమే. ఆ మూవీలో హీరోయిన్ గా ఇప్పటికైతే ఎవరూ అఫీషియల్ గా కుదిరినట్లుగా చిత్ర యూనిట్ వర్గాల నుంచి  స్టేటెంట్లు లేవు. ఆ మధ్యన రోజుకొక పేరు ప్రచారంలో ఉంటూ వచ్చింది. ఇపుడు మాత్రం సమీరారెడ్డి బాలయ్యతో ఆడి పాడబోతోందని అంటున్నారు. సమీరారెడ్డి ఒకపుడు జూనియర్ తో మూడు సినిమాలు చేసింది. ఆమె అప్పట్లో జూనియర్ కి హిట్ జోడీగా ఉండేది.

 

ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉందని కూడా నాడు పుకార్లు షికార్లు చేసేవి. ఇవన్నీ పక్కన పెడితే సమీరారెడ్డి చాలా కాలం క్రితమే సినీ ఫీల్డ్ ని వదిలేసింది. ఆమె పెళ్ళి చేసుకుని సెటిల్ అయింది కూడా. ఆమె ఓ బిడ్డ తల్లి. అటువంటి సమీరా రెడ్డి రీ ఎంట్రీ బోయపాటి మూవీ ద్వారా ఇస్తోందని టాక్ నడుస్తోంది. ఆమె బాలయ్య పక్కన కీలకమైన హీరోయిన్ రోల్ ప్లే చేస్తోందని కూడా చెబుతున్నారు. అదే కనుక జరిగితే ఒకనాటి జూనియర్ బ్యూటీ బాబాయ్ పక్కన చేరి ఆడి పాడుతుందన్న  మాట.

 

 

చూడాలి  మరి . ఏది ఏమైనా గతంలో కూడా బాలయ్య జూనియర్ హీరోయిన్లతో వర్క్ చేశాడు. ఆ విధంగా శ్రియ వంటి హాట్ బ్యూటీలతో ఆడి పాడాడు. ఇపుడు అదే బాలయ్య మరో మారు అబ్బాయి హీరోయిన్లను కోరుకుంటున్నాడంతే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: