అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీ బుల్లితెర మీద మంచి పేరు తెచ్చుకున్న యాంకర్లు అనసూయ, సుమ. సుమ చాలా సంవత్సరాల నుంచి యాంకరింగ్ లో తనకంటూ మంచి పేరు, ప్రత్యేకత చాటుకుంది. వాస్తవానికి అనసూయ, సుమ మధ్య పది సంవత్సరాలు గ్యాప్ ఉంది అనే చెప్పాలి. ఇద్దరికీ వివాహం అయినప్పటికీ కూడా యాంకరింగ్ లో వారి సత్తా చాటుకుంటూ వస్తున్నారు. తాజాగా సుమ, అనసూయ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

 


ఇక అసలు విషయానికి వస్తే... ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో సినిమా కార్యక్రమాలు అన్నీ కూడా యాంకరింగ్ గా సుమ చేస్తుంది. ఇది ఇలా ఉండగా అనసూయకు అవకాశాలు వస్తున్నా కానీ సుమ వాటినీ దక్కించుకుంటుంది అనే వార్తలు తెలుగు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అనసూయ కాస్త దూకుడుగా ప్రవర్తించడానికి ఇందుకు ముఖ్య కారణం అని కూడా అందరూ అంటున్నారు. అనసూయకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ.. అంతే కాకుండా అవకాశం వస్తే చీరకట్టులో కూడా అందరిని కట్టుకుంటా అని చెప్పినా సరే అనసూయ ఎక్కువ అవకాశాలు ఇవ్వటం లేదు.

 


తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ లో జరిగే టీవీ షో ప్రోగ్రాం విషయంలో అనసూయ, సుమ మధ్య వివిధ అభిప్రాయాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఒక ప్రోగ్రాం కోసం అనసూయను సంప్రదించడం జరిగింది. కానీ తర్వాత సుమ ఆ ప్రోగ్రాంకి ఓకే అంటూ సందేశం పలికింది. తన రెమ్యునిరేషన్ కూడా తగ్గించి ఓకే చెప్పడంతో ఆ చానల్ ప్రముఖులు సుమకి ఓకే చెప్పారు. ఇలా జరగడంతో అనసూయ సుమ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఆ చానల్ నుంచి బయటికి రావడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: