టాలీవుడ్ లో ఇప్పుడు ఫాన్స్ హీరోల నుంచి కొత్త దనం  కోరుకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతు౦ది. హీరోలు ఎంత కొట్టగా కనపడితే అంత బాగా ఆదరిస్తున్నారు. హీరోలు కూడా ఇప్పుడు అభిమానులు ప్రేక్షకుల కోరిక మేరకు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులను ప్రేక్షకులను అలరించడానికి గాను తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గడ్డం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు గడ్డం ఉంచుతున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు అన్ని సినిమాల్లో గడ్డం ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. మహర్షి సినిమాలో మహేష్ గడ్డం తోనే కనిపించాడు. ఇక మరో హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో గడ్డం తోనే కనిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో మీసం తో కనపడుతున్నాడు. అదే విధంగా రాబోయే సినిమాలో గడ్డం తో కనిపించే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే... అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ కాస్త లైట్ గా గడ్డం తో కనిపించాడు. 

 

ఇప్పుడు వచ్చే పుష్ప సినిమాలో గడ్డం తో కనిపిస్తున్నాడు బన్నీ. అలాగే యువ హీరో నాగ చైతన్య కూడా గడ్డం తోనే కనిపించే అవకాశం ఉంది. మెగా హీరోలు అందరూ కూడా గడ్డం తోనే కనపడుతున్నారు. గడ్డం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సీనియర్ హీరో రవి తేజా కూడా గడ్డం తోనే కనపడే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ కూడా గడ్డం తోనే అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వస్తున్న నారప్ప సినిమాలో వెంకటేష్ గడ్డం తోనే కనిపిస్తున్నాడు. ఇలా అందరికి గడ్డం ఇప్పుడు ట్రెండ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: