కరోనా ప్రభావం గట్టిగా పడిన వాళ్ళల్లో నిర్మాతలు ముందు వరుసలో ఉన్నారు. కరోనా ప్రభావం వాళ్లకు తగిలినట్టు మరొకరికి తగ్గలేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారీ ప్రాజెక్ట్ లు కూడా దాదాపుగా ఆగిపోయిన నేపధ్యంలో ఇప్పుడు హీరోలు నిర్మాతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాతలు నష్టాల నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారని అంటున్నారు. దానికి కారణం సినిమాలు ఎక్కువగా విడుదల కాకపోవడం. 

 

బడ్జెట్ తక్కువగా ఉన్నా సరే సినిమా విడుదల కావడానికి దాదాపుగా ఏడాది పైగా పడుతుంది. వచ్చే లాభం మొత్తం కూడా ఇప్పుడు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. సినిమా హిట్ అయితే ఏమీ లేదు హిట్ అవ్వకపోతే మాత్రం వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు... వాళ్లకు కరోనా రూపంలో పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. సినిమాలు అన్నీ కూడా విడుదల ఆగిపోయాయి. చేసే సినిమాలు అన్నీ కూడా ఇప్పటిలో విడుదల అయ్యే అవకాశం దాదాపుగా లేదని అంటున్నారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. హీరోల పారితోషికం భారీగా తగ్గించాలి అని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే నిర్మాతలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దాదాపు హీరోకి కోటి నుంచి రెండు కోట్ల వరకు తగ్గిస్తే మినహా లాభం లేదని భావిస్తున్నారు. స్టార్ నిర్మాతలు కూడా ఇదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చిన్న హీరోలను దాదాపుగా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని అర్ధమవుతుంది. దీనిపై అవసరం అయితే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: