మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. మెగా హీరోలు ఎక్కువగా చిరంజీవి సూచనలతో సినిమాల్లోకి అడుగు పెడుతూ ఉంటారు. కథల ఎంపికలో కూడా ఆయన సలహాలను ఎక్కువగా తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. అగ్ర హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా చిరంజీవి సలహాలను ఎక్కువగా తీసుకుని సినిమాలు చేస్తారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఆయన సలహా లేకుండా సినిమాలను అసలు చేయరు. అందుకే చిరంజీవి కూడా వాళ్ళ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. 

 

చిరంజీవి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు... అకీర్ నందన్ ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ బాధ్యతను ఆయన రామ్ చరణ్ కి అప్పగించారు అంటున్నారు. రామ్ చరణ్ అకీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. తానే నిర్మాతగా మంచి దర్శకుడి దర్శకత్వంలో సినిమాల్లోకి తన తమ్ముడ్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని... 

 

అకీర్ ని హీరోగా పరిచయం చేసే సినిమాలో తాను కూడా ఉండాలని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. పెద్దగా తాను సినిమాలో ఉంటే అకీర్ కి ధైర్యం ఉంటుంది అని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ కి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. చిన్న చిన్న విషయాలను కూడా ఆయన పట్టించుకుని ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో ఆయన కనిపించాడు. ఇప్పుడు చేసే సినిమాల విషయంలో తన తండ్రి, చిరంజీవి సలహాలను తీసుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: