మామా అల్లుళ్లు.. చిరంజీవి, సాయిధరమ్ తేజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీలు కుదిరినప్పుడల్లా మెగా ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ.. తన గౌరవాన్ని చాటుకుంటాడు తేజు. అయితే ఇక నుంచి మెగా ఫ్యామిలీ గురించి ముఖ్యంగా చిరంజీవి ప్రస్తావన రాకూడదని నిర్ణయించుకున్నాడు తేజు. దీనికో కారణం ఉందట.

 

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ అంటే.. చిరంజీవి సినిమా పాటలే కనిపిస్తాయి. మెగాస్టార్ పాటలకు రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ స్టెప్పులేశారు. ఇక తేజు అయితే.. ఇప్పటి వరకు నాలుగు పాటలను రీమీక్స్ చేశారు. 

 

సాయి ధరమ్ తేజ్ కెరీర్ రీమిక్స్ సాంగ్స్ తో మొదలైంది. డెబ్యూ మూవీ రేయ్ కోసం దొంగలోని గోలీమార్ సాంగ్ రీమిక్స్ కు స్టెప్పులేశారు. ఆ తర్వాత సుప్రీమ్.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లోని రీమీక్స్ సాంగ్.. సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 

 

తన ప్రతి సినిమాలో రీమిక్స్ కంపల్సరీగా ఉండాలని తేజు పట్టుబట్టలేదు. హైప్ కోసం.. ఓపెనింగ్స్ కోసమే దర్శకులే ఇలా రీమిక్స్ చేస్తే.. గువ్వ గోరింక సాంగ్ ఉన్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్... అందం హిందోళం పాటతో వచ్చిన సుప్రీమ్ హిట్ అయ్యాయి. దీంతో ఇదో సెంటిమెంట్ గా భావించిన దర్శకులు రీమిక్స్ కంటిన్యూ చేశారు. అయితే ఇదే సెంటిమెంట్ తో కొండవీటి దొంగలోని చమక్ చమక్ రీమిక్స్ తో వచ్చిన ఇంటెలిజెంట్ మూవీ ఫ్లాప్ అయింది. 

 

తనకు ఇష్టం లేకపోయినా.. దర్శకుల కోరిక మేరకు రీమిక్సుల్లో నటించాల్సి వచ్చిందని తేజు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి సాంగ్స్ లేకుండానే వచ్చిన చిత్రలహరి.. ప్రతిరోజు పండుగే హిట్ అయింది. ప్రస్తుతం నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ లో కూడా రీమిక్స్ సాంగ్ లేదట. మున్ముందు కూడా సాధ్యమైనంత వరకు రీమిక్సులు లేకుండా.. చేయాలన్న ఉద్దేశంతో తేజు ఉన్నాడట. ఒరిజినల్ ప్లేస్ చెడగొట్టడం ఇష్టం లేకనే.. రీమిక్సుల జోలికి తేజు వెళ్లడం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: