గీతా గోవిదం సినిమాతో  హీరోయిన్ ర‌ష్మిక మందన్నా తెలుగు  ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా దగ్గ‌రైపోయింది. ముఖ్యంగా కోట్లాది మంది కుర్ర‌కారుల హృద‌యాల‌ను ఈ భామ కొల్ల‌గొట్టేసింద‌నే చెప్పాలి. అయితే మాములు ప్రేక్ష‌కుల‌ను కాదు..యంగ్ హీరోల‌ను సైతం త‌న ఫ్యాన్స్ ఖాతాలో వేసేసుకుంటోంది. సినిమాల్లోనే కాదు..బ‌య‌ట కూడా చాలా చ‌లాకీత‌నంతో ఇట్టే అంద‌రినీ ఆక‌ట్టుకునే గుణం ఈ భామ సొంతం. ఈ చ‌లాకీత‌న‌మే చాలామంది యంగ్ హీరోల‌కు ఆమెపై క్ర‌ష్ పెరిగేలా చేస్తోందంట‌. అయితే అంద‌రూ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌కున్నా...ఒక‌రిద్ద‌రూ మాత్రం ఈ భామ‌పై ఉన్న అభిమానాన్ని క్ర‌ష్‌ను వెల్ల‌గ‌క్కేయ‌డం విశేషం. 

 


తమిళ హీరో హరీష్‌ కల్యాణ్‌ హీరోగా బాలీవుడ్‌ చిత్రం విక్కీ డోనార్‌ను తమిళంలో ‘ధారాళ ప్రభు’ పేరుతో రీమేక్‌ చేశారు. మార్చి 13న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాకు కూడా మంచి స్పంద‌న ల‌భించింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడంతో సినిమా ప్రదర్శన మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. చేసేదేమీ లేక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్‌ జవాబులిచ్చాడు.  ప‌నిలో ప‌నిగా కొన్ని ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా బ‌య‌ట‌పెట్టేశాడు.


అయితే ఓ నెటిజ‌న్ ‘నీకు ఏ హీరోయిన్‌ అంటే క్రష్‌’ అంటూ  సంధించిన ప్ర‌శ్న‌కు ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా  రష్మికా మందన్నా అంటూ వెంట‌నే చెప్పేశాడు. ఈ సమాధానం చూసిన పలువురు రష్మికా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. త్వరలో రష్మికాతో ఏమైనా సినిమా చేయబోతున్నారా అని హరీష్‌ను మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా అందుకు మాత్రం  ఆ హీరో ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉండ‌గా  ప్రస్తుతం హరీష్‌ తెలుగు చిత్రం పెళ్లి చూపులు తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయింది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: