టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలూ కూడా ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో సైతం బాహుబలి తన కలెక్షన్ల ప్రభంజనాన్ని వారికి రుచి చూపించింది. ఇక ఆ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు ఆర్జించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్న ఈ సినిమా రాబోయే 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇక రెండేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా, పలు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాహుబలి, బాహుబలి 2 రికార్డ్స్ ని కొల్లగొడుతుంది అంటూ కొద్దిరోజులుగా పలువురు సినిమా ప్రేక్షకులు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చలు మొదలెట్టి, కొద్దిపాటి వివాదాలను సృష్టిస్తున్నారు. వారిలో కొందరేమో బాహుబలి రికార్డ్స్ ని కొట్టగల సత్తా మళ్ళి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ కే సాధ్యం అని అంటుంటే, ఇంకొందరు మాత్రం ఆ అవకాశం కెజిఎఫ్ చాప్టర్ 2 కే ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

అది మాత్రమే కాక ఇంకొందరు అయితే వీటిలో ఏ సినిమా బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొడుతుంది అంటూ పోల్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక వాస్తవం చెప్పాలంటే ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రెండూ కూడా దేనికవే భిన్న ధ్రువాలైన సినిమాలని, అలానే రెండు సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న మాట వాస్తవం అని, కాగా నిజంగా వాటిలో ఏది బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదు, రేపు అవి రిలీజ్ అయినా తరువాతనే చెప్పగలం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చేయడయంతో తాంబూలాలు ఇచ్చాము ఇక తన్నుకు చావండి అనే చందాన ఉంది ఈ సినిమాల గురించి ప్రస్తుతం జరుగుతున్న వాదన అని, కాబట్టి ఇప్పుడే వీటి గురించి వాదించుకోవడం సరైనది కాదని వారు అంటున్నారు.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: