తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత దేశంలోని సినీప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ 2021 జనవరి 8 న సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి అధికారకంగా ప్రకటించారు. వాస్తవంగా అయితే ఈ సమ్మర్ లోనే ఆర్.ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ అండ్ సీ.జీ వర్క్ అయ్యోలా లేకపోవడం తో వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.

 

అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాది కూడా అనుకున్న డేట్ కి రిలీజ్ కావడం దాదాపు అసాధ్యమని అంచనా వేస్తున్నారు. ఇలా అంచనా వేయడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జూన్ నెలాఖరు లోపు బ్యాలెన్స్ వర్క్ అంటే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం కంప్లీట్ చేయలని షెడ్యూల్ వేసుకున్నారట. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జూన్ నెలాఖరు లోపు షూటింగ్స్ తిరిగి మొదలయ్యో అవకాశాలు కనిపించడం లేదు.

 

వాస్తవంగా టీం అనుకున్న ప్రకారం కరోనా సమస్య లేకపోతే అక్టోబర్ లేదా నవంబర్ లోపు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ కాపీ రెడీ చేయాలని సన్నాహాలు చేసుకున్నారు. తర్వాత  ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇప్పుడు ప్లాన్స్ మొత్తం మారిపోయాయని సమాచారం. ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఇప్పుడు పని చేసేలా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడే కాకుండా ఇతర దేశాలలోను జరపాలి. కాని అది అయ్యోల్లా కనిపించడం లేదు. దాంతో 2021 జనవరి 8 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అసాధ్యమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: