పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్లీ సినిమాల్లో చేయనని చెప్పాడు. దాంతో ఆయన అభిమానుల్లో ఒకరకమైన అసహనం కలిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని ప్రతీ అభిమాని కోరుకున్నాడు. అయితే ఆ కోరిక నెరవెర్చుతూ పవన్ బాలీవుడ్ సినిమా పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.

 

దిల్ రాజు నిర్మాతగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. తొందరగా పూర్తిచేసి మే నెలలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో వాయిదా పడింది. అయితే లాక్డౌన్ పూర్తయ్యాక థియేటర్లలో కనిపించే మొదటి పెద్ద సినిమా వకీల్ సాబ్ అయ్యుంటుందని చెప్తున్నారు.

 

 అయితే ఈ సినిమాలో పవన్ తో పాటు ముగ్గురు అమ్మాయిల పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ ముగ్గురు అమ్మాయిలు ఒక కేసులో ఇరుక్కోవడంతో, వాళ్లకి సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ లాయర్ గా వస్తారు. సినిమా మొత్తం ఎక్కువ భాగం కోర్ట్ లోనే ఉంటుంది. అయితే ఆ ముగ్గురు అమ్మాయిల్లో నివేథా థామస్ ఒకరిగా కనిపిస్తుంది. మరో అమ్మాయిగా మల్లేశం హీరోయిన్ గా అనన్య కూడా కనిపించనుందని సమాచారం.

 

అయితే వీరితో పాటు మరో అమ్మాయి కూడా ఉంటుందట. అయితే ఆ అమ్మాయి ఎవరనేది పక్కన పెడితే, ఆమె కాకుండా శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజం కావని, శృతి హాసన్ స్పష్టత ఇచ్చింది. గబ్బర్ సింగ్ లో కలిసి నటించిన శృతి హాసన్ వకీల్ సాబ్ లో లేదని కన్ఫర్మ్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: