తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓటమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల పల్స్ ని పట్టేసిన ఈ దర్శకుడు ప్రేక్షకులందరికీ నచ్చి మెచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకుంటున్నారు . చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా తనదైన  టేకింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే తనదైన మార్క్ చూపించి  ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించాడు . మొదటి సినిమా తోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత రాజా ది గ్రేట్, సుప్రీమ్ లాంటి సినిమాలు తెరకెక్కించిన తన సత్తా చాటాడు. 

 

 

 ఇక గతేడాది ఎఫ్2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి  అందరినీ కడుపుబ్బ నవ్వించాడు అనిల్ రావిపూడి. మెగా హీరో వరుణ్ తేజ్ సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది . కథ పరంగా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా తనదైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ప్రేక్షకులకి ఎప్పుడూ ఎవర్గ్రీన్ ఫేవరెట్ సినిమా గా నిలిచే విధంగా ఎఫ్ 2 సినిమా ఉంది . అయితే ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో సీక్వల్  తీయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లైన్ కూడా అనుకున్నట్లు అనిల్ రావిపూడి గతంలో క్లారిటీ ఇచ్చాడు. 

 

 

 ఇక ఇప్పుడు ఎఫ్ 3 కి సంబంధించిన స్క్రిప్టుపైనే కసరత్తులు చేస్తున్నారు ఈ యువ దర్శకుడు. ఎఫ్ 2 సీక్వెల్ లోనూ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో హీరో ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప అనే రా  కంటెంట్ సినిమా కోసం రెడీ అవుతుండగా... స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా కోసం మెగా హీరో వరుణ్ తేజ్ రెడీ  అవుతుంన్నాడు . ఇద్దరు హీరోల సినిమాలు  అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయి. కాగా ఈ  రెండు సినిమాలు పూర్తవగానే అనిల్ రావిపూడి తన సినిమాను పట్టాలెక్కించే  పనిలో పడ్డాడట యువ దర్శకుడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: