కరోనా లేకుంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ రెడ్ ఈపాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. అందులో భాగంగా మేకర్స్ ఈచిత్రాన్ని ఈనెల 9న విడుదలచేయాలనుకున్నారు కానీ కరోనా వారి ఆశల పై నీళ్లు చల్లింది. కరోనా, భారత్ లోకి కూడా ప్రవేశించడం తో లాక్ డౌన్ ను విధించారు దాంతో థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పటికే విడుదలకావల్సిన పలు సినిమాలు  వాయిదాపడ్డాయి. అయితే రోజు రోజు కరోనా తీవ్ర రూపం దాల్చుతుండడం తో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తి వేస్తారో చెప్పలేని పరిస్థితి.
 
ఒకవేళ ఎత్తి వేసినా అంత తొందరగా థియేటర్లు తెరుచుకోవు. ఒకవేళ  ఓపెన్ అయినా కూడా కరోనా భయం వల్ల సినిమాలు చూడడానికి జనాలు ఇప్పట్లో సినిమా హాళ్లకు రారు. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థుతుల మధ్య అయోమయంలో వున్న నిర్మాతలకు ఓటిటి వేదికలు గాలం వేస్తున్నాయి. డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం ఫాన్సీ రేట్లను ఆఫర్ చేసి  సినిమాల ను కొనడానికి రెడీ అవుతున్నాయి. అయితే అందుకు హీరోలు ,దర్శకులు అడ్డుపడుతున్నారు. 
 
ఈ జాబితాలో రామ్ ,రెడ్ కూడా వుందట. థియేట్రికల్ రిలీజ్ లేకుండా రెడ్ ను దక్కించుకోవడానికి పలు ఓటిటి సంస్థలు నిర్మాత స్రవంతి రవి కిషోర్ ను ఫ్యాన్సీ రేట్లకు అడుగుతున్నాయట. రామ్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని డైలమా లో ఉన్నాడని  ఓ ఈ పేపర్ రాసుకొచ్చింది. దీని గురించి రామ్ ఫ్యాన్స్ , రామ్ ను అడుగగా రామ్ ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చాడు. నేను డైలమా లో లేను హ్యాపీ గా హోమ్ క్వారంటైన్ లో వున్నాను. నా ఫ్యాన్స్, రెడ్ ను థియేటర్లలో చూడడం కోసం ఎదురుచూస్తున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. సో రెడ్ థియేటర్లలోకి రావడంపక్కా అనే తేలింది కాకపోతే  అందుకు మరో రెండు నెలలు సమయం పట్టేలాగే వుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: