టాలీవుడ్ లో దేవదాస్ మూవీతో హీరోగా పరిచయం అయిన హీరో రామ్ పోతినేని తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు.  టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ కి నేను శైలజ తర్వాత సరైన హిట్ పడలేదు.  దాంతో కెరీర్ పీకల్లోతు కష్టాల్లో పడ్డదిరా బాబోయ్ అనుకుంటున్న సమయంలో పూరి జగన్నాథ్ దర్శతక్వంలో గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీతో రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.. దాంతో ఇప్పుుడు వరుసగా సినిమాల్లో నటించేందుక సిద్దమయ్యాడు.  ప్రస్తుతం రామ్ ద్విపాత్రిభినయంలో నటిస్తున్న ‘రెడ్’ మూవీ కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

 

దేశంలో కరోనా ఎఫెక్ట్  రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దీని తీవ్రత మరీ ఎక్కువవుతుండటం - దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుందని తెలిసినా దేశ ప్రజలని రక్షించాలనే ఉద్దేశంలో లాక్ డౌన్ విధించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రమిది. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

అయితే ఈ సినిమా రిలీజ్ పై ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అంతే కాదు..   రెడ్ సినిమా కూడా ఆన్ లైన్ లో రాబోతుందని అనే ప్రచారం జరుగుతోంది.దీనిపై ఓ అభిమాని రామ్ కి రిక్వెస్ట్ చేసాడు. దయచేసి ఈ మూవీ డిజిటల్ రిలీజ్ వొద్దని అభిమాని కోరడంతో..  తాజాగా ఈ విషయంపై రామ్ స్పందిస్తూ.. ఆలస్యమైన థియేటర్స్ లోరిలీజ్ చేయమని సోషల్ వేదికగా కోరాడు. దీనిపై స్పందించిన రామ్.. రెడ్ రిలీజ్ థియేటర్స్ లోనే ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి డైలమా లేదని వివరణ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: