టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం అనేది ఈ మధ్య చాలా కష్టం అయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే వాళ్ళ పక్కన ఎవరిని ఎంపిక చెయ్యాలి అనేది దర్శక నిర్మాతలకు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లకు హీరోయిన్స్ దొరకడం లేదు ఇప్పుడు. వెంకటేష్ సినిమాలకు ఏమో గాని... బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు హీరోయిన్స్ ని ఎంపిక చేయడం అనేది చాలా కష్టంగా మారిన అంశం గా చెప్పుకోవచ్చు. చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ కోసం చాలా రోజులు ఎదురు చూసారు. 

 

ముందు త్రిష అనుకోవడం ఆ తర్వాత ఆమె తప్పుకోవడం... ఆ తర్వాత కాజల్ అనుకోవడం, మళ్ళీ అనుష్క, లేదు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అనుకోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు మాత్రం చివరిగా కాజల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. సినిమా కరోనా కారణంగా ఆగింది. ఇక ఇది పక్కన పెడితే... ఇప్పుడు బాలకృష్ణ కు హీరోయిన్ ని ఎంపిక చేయడం కూడా దర్శక నిర్మాతలకు కష్టంగా మారింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటీ అంటే బాలకృష్ణ కు వయసు మీద పడటం తో ఏ హీరోయిన్ కూడా ఆయన పక్కన మ్యాచ్ అవ్వడం లేదట. 

 

బాలకృష్ణ పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా వద్దని అంటున్నారని టాక్. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు సమాచారం. ముందు యువ హీరోయిన్ ని తీసుకోవాలని చూసినా సరే అభ్యంతరం చెప్పడంతో బాలకృష్ణ పక్కన రెండు సినిమాలు చేసిన నయనతారను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఇప్పుడు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా దసరా కు విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: