ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన సక్సస్ ఫుల్ జర్నీ ఏంటో అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించారు. ప్రస్తుతం పన కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ కి అఫీషియల్ రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఇక నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో నిర్మించిన 'వి' రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రయిమ్ ఒక ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒక రేటు అనుకున్నప్పటికి డీల్ క్లోజ్ అవలేదట.

 

అందుకు కారణం దిల్ రాజు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. 40 కోట్ల వరకు వస్తేనే డీల్ క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు. 
అయితే ఈ డీల్ అమెజాన్ డైరక్ట్ గా డీల్ చేయడం లేదట. ఇద్దరి మధ్య మీడియోటర్స్ తోనే చర్చలు జరుగుతున్నాయట. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా ఇదే విధమైన డీల్ నడుస్తుందట. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడట. ఎంతైనా బిజినెస్ మాన్ కదా.

 

అయితే ఈ డీల్స్ క్లోజ్ అవ్వాలంటే ప్రస్తుతం భాస్వామ్యం ట్రెండ్ నడుస్తుంది కాబట్టి హీరో, దర్శకుడు, నిర్మాత ...ఇలా అందరూ ఒకే నిర్ణయానికొస్తేనే డీల్ సెట్ అవుతుంది. ఇది సెట్ అవ్వాలంటే సినిమా థీయోటర్స్ కి రావాల్సిందేనని తెలుస్తుంది. కాని కరోనా నేపథ్యంలో సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయని తాజా పరిస్థితులు చూస్తే తెలుస్తుంది.

 

ఇక ఇప్పటికే వేల కోట్ల లో చిత్ర పరిశ్రమకి నష్ఠం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో కొత్త సినిమాలు నిర్మించే ధైర్యం ఏ నిర్మాతా చేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే షూటింగ్ మొదలైన సినిమాలు,సగం కంప్లీటయిన సినిమాలు .. అలాగే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇవన్ని ఒక కొలిక్కి వస్తే గాని కొత్త సినిమాలు ప్రారంభానికి నోచుకోవు.   

మరింత సమాచారం తెలుసుకోండి: