కరోనా మహమ్మారి బారిన పడి రోజుకి కొన్ని వేలమంది మరణిస్తుండగా వారిలో ఇప్పుడు మరొక సెలబ్రిటీ పేరు కూడా చేరింది. ఇప్పటికే ఎంతో మంది హాలీవుడ్ నటీనటులకు మరియు ఇతర దేశాల ప్రధానమంత్రుల కు, మంత్రుల కు సోకిన వైరస్ తాజాగా బ్రిటన్ కు చెందిన సైకాలజిస్ట్ హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ ప్రాణాలు తీసింది. విషయాన్ని ఆమె మనవడు అలెక్స్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ధ్రువీకరించడం తో వెలుగులోకి వచ్చింది.

 

హిల్లరీ ముఖేష్ రివ్స్ హారర్ చిత్రం విచ్ ఫ్రెండర్ తో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈమె లక్షలాది మంది అభిమానులు మెప్పును పొందింది. ఇంకా అనేక చిత్రాలకు నిర్మాతగా వహించిన ఘనత కూడా ఈమె సొంతం. ఆటు నటిగా మరియు ఇటు నిర్మాతగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిన హిల్లరీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హిల్లరీ 1960, 1970 దశకాలలో పలు సినిమాలలో నటించగా ఆమె 1990ల్లో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

 

నిల్ బై మౌత్ యాన్ ఆవ్ఫుల్లీ అడ్వెంచర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె కొద్ది కాలంలోనే గొప్ప పేరుని సంపాదించారు. సినిమా రంగంలోకి రాకముందు హిల్లరీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత వివిధ ఆస్పత్రుల్లో అడిక్షన్ కౌన్సెలర్గా విధులు నిర్వహించారు. అనంతరం సినిమా రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు.

 

కరోనా వైరస్ బారిన పడి హిల్లరీ మృతి చెందడం పట్ల అక్కడి హాలీవుడ్ ఇండస్ట్రీలో విచార ఛాయలు పులుముకున్నాయి. నెటిజన్లు అంతా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: