ప్రస్తుతం తెలుగులో స్టార్ ట్యాగ్ ఉన్న హీరోయిన్లలో కనిపించే పేర్లు రెండే రెండు. ఒకటి పూజా హెగ్డే. రెండు రష్మిక మందన్న. తెలుగులో తెరకెక్కుతున్న పెద్ద పెద్ద సినిమాలకి వీరే ఆప్షన్ గా మారుతున్నారు. అయితే పూజా హెగ్డే, లేకుంటే రష్మిక మందన్న అంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన వారు ప్రస్తుతం హీరోయిన్ బేస్డ్ సినిమాలు తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల వీరిద్దరికీ బాగా డిమాండ్ పెరిగింది.

 

రష్మిక మందన్న బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది. ఇంకా రెండు మూడు చిత్రాలని లైన్లో పెట్టిందని టాక్. వరుస హిట్లు కొడుతున్న రష్మికకి అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆమె పుట్టినరోజున అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు. అయితే తమిళ హీరో హరీష్ కళ్యాణ్ కి రష్మికపై క్రష్ ఉందట. ఈ విషయాన్ని హరీష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

 

లాక్డౌన్ కారణంగా సినిమాలు లేక ఇంటికే పరిమితమైన హరీష్ సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన హరీష్, ఒకానొక అభిమాని మీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ ఉందని అడగ్గా, రష్మిక అని ఆమెను ట్యాగ్ చేశాడు. దీంతో రష్మిక అభిమానులు షాక్ అయ్యారు. హరీష్ తమిళంలో బిజీ యాక్టర్.

 

తెలుగులో హరీష్ కళ్యాణ్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో కనిపించాడు. క్లైమాక్స్ లో నాని హెల్త్ ప్రాబ్లమ్ గురించి రివీల్ చేసే పాత్రలో కనిపించే హరీష్ కళ్యాణే. ప్రస్తుతం హరీష్ తెలుగు పెళ్ళి చూపులు తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. కోవిడ్ ౧౯ కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. హరీష్ కళ్యాణ్ రష్మిక పేరు చెప్పడంతో ఆమెకి తెలుగు, కన్నడలోనే కాదు తమిళంలోనూ ప్రేక్షకులు ఉన్నారని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: