కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. కరోనాను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించింది. అయితే 21 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కనిపించకపోవటంతో ఈ నెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ను పొడిగిస్తున్నట్టుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. కేంద్ర కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో అత్యం తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. అందుకు మద్దతుగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరుతూ బెబో కరినా కపూర్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రజలను ఇళ్లలోనే ఉండాల్సిందిగా కోరింది. యునిసెఫ్ ఇండియా తరపున హిందుస్థాన్ యూనిలివర్‌తో కలిసి చేస్తున్న క్యాంపెయిన్‌లో భాగంగా బెబో ఈ పోస్ట్ చేసింది.

 

`ప్రస్తుతం లాక్‌ డౌన్‌ ఏప్రిల్ 30 వరకు పొడిగించ బడింది. ఈ పరిస్థితుల నుంచి మనం బయట పడాలంటే ప్రస్తుతం మనం చేయగలిగిన ఒకే ఒక్క పని ఇంట్లో ఉండటం. మరింత బలంగా పోరాటం చేయాలి. చైన్‌ను బ్రేక్ చేయడానికి కలిసి కట్టుగా పనిచేయాలి` అంటూ పోస్ట్ చేసింది. మహారాష్ట్రతో పాటు పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇప్పటికే లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: