లాక్‌ డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఫిట్ నెస్ మీద దృష్టి పెడతారు. ఖాళీ సమయంలో మరింత ఫిట్‌గా తయారయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు. అంతేకాదు తమ అభిమానుల్లోనూ అదే ఇంట్రస్ట్ క్రియేట్ చేసేందుకు తమ వర్క్‌ అవుట్ వీడియోస్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ సీనియర్‌ నటి కూడా తన వర్క్‌ అవుట్‌ వీడియోస్‌ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

 

ప్రస్తుతం చోటీ సర్దార్నీ టీవీ సీరియల్‌లో నటిస్తున్న సీనియర్ నటి అనిత రాజ్‌. 57 ఏళ్ల వయసులోనూ హాట్‌ ఫిగర్‌తో అదరగొడుతున్న ఈ బ్యూటీ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంది. తన వర్క్‌ అవుట్‌ వీడియోస్‌ను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలతో పాటు `మన శరీరతత్వానికి మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. మన శరీరాన్ని మనం ప్రేమించటం చాలా అవసరం. ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల`ని కామెంట్ చేసింది.

 

తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ను అభిమానులతో పంచుకుంది అనిత రాజ్‌ ``నా ఫిట్‌ నెస్‌ మంత్రా ఒకటే.. ఆరోగ్యకరమైన ఆహారం తినటం.. శరీర తత్వానికి తగ్గట్టుగా వర్క్అవుట్ చేయటం. నా అభిమానులను నేను ఒకటే కోరుతున్నా.. ఈ ఖాళీ సమయాన్ని, తమ శరీరాలు, మనసు, బుద్ధి స్వచ్చంగా మార్చుకోవాడానికి వినియోగించుకోండి. వెయిట్ ట్రైనింగ్‌ సెషన్స్ తీసుకోండి. సిట్‌ అప్స్‌, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్‌ లాంటివి చేయండి. మీ శరీరమే ఓ దేవాలయం. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి` అంటూ అభిమానులకు తమ సందేశాన్ని ఇచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Love every minute 😄 Feeling strong 💪💪💪 80kg, weighted glute bridges My strength levels are getting naturally elevated & my body more toned with my @ace.blend nourisher. Absolutely love it. #strengthtraining #justdoit #strongminds #nocompromise #feelfit #fithaitohhithai #enhancing

A post shared by Anita Raaj (@anitaraaj) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

72kg DL ,feels good,💪 Thank you @atulsinghrathod @shivfit Thank you @ace.blend my complete super food nourisher. #justdoit #mindovermatter #form #nevergiveup

A post shared by Anita Raaj (@anitaraaj) on

మరింత సమాచారం తెలుసుకోండి: