టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఎస్ ఎస్ రాజమౌళి, ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ కొట్టి మంచి పేరు దక్కించుకున్నారు. ముందుగా కొన్నాళ్ళు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గర శిష్యరికం చేసి, పలు దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న రాజమౌళి, రెండవ సారి కూడా ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి మరొక సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆపై నితిన్ సై దగ్గరి నుండి మొన్న ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల వరకు ఒక్కో సినిమాతో దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఎంతో గొప్ప పేరు సంపాదిస్తూ సంచలన విజయాలతో ముందుకు సాగుతున్న రాజమౌళి, ప్రస్తుతం కేవలం టాలీవుడ్ లేదా సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, యావత్ భారత దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకధీరుడిగా గొప్ప పేరు దక్కించుకున్నారు. అయితే ఆయనకు ఆ పేరు అంత సులువుగా రాలేదు అనే చెప్పాలి. 

 

యమదొంగ, మగధీర వంటి భారీ సినిమాలైనా, ఈగ వంటి ప్రయోగాత్మక సినిమాలైనా, లేదా సునీల్ వంటి స్టార్ తో అలరించే కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకుల మెప్పు పొంది సూపర్ హిట్ కొట్టాలన్నా,అది కేవలం రాజమౌళి కే చెల్లిందని అంటున్నారు సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు. ఇక తన సినిమా కథ యొక్క మెయిన్ ప్లాట్ ను ప్రేక్షకులకు ముందుగానే తెలిపే అలవాటున్న రాజమౌళి, ఆ విధంగా ముందుగానే సినిమా థీమ్ తో ప్రేక్షకుడిని కనెక్ట్ చేసి మరీ హిట్స్ కొడుతుంటారు. నిజానికి ఆయన దగ్గర ఏదైనా టెక్నీక్ ఉందా, అలానే తన కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యేలా రాజమౌళి ఏమి ట్రిక్ ప్రదర్శించారని ఇప్పటికీ కూడా ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తున్న ఎందరో ప్రేక్షకులు, సినిమా ప్రముఖులకు సమాధానం దొరకని ప్రశ్న అది. 

 

అయితే వాస్తవానికి మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి తాను సిద్ధం చేసుకున్న ప్రతి కథని ఎన్నో సార్లు చెక్ చేసుకుంటారని, ఆ తరువాత సినిమాలోని కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతవరకు చేరువ అవుతాయి, పాటలు ఎంతవరకు రీచ్ అవుతాయి, యాక్షన్, ఫైట్స్ వంటివి ఏ స్థాయిలో ఉంటె కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ ఎలివే చేయాలి వంటి ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో నిశితంగా తన టీమ్ తో కలిసి పలు విధాలుగా ఆలోచన చేసి మరీ తీస్తారట. అలానే ఏదైనా ముఖ్యమైన సీన్ తీసినప్పుడు, తాను కూడా ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఫీల్ అయి దానిని చూడడంతో పాటు, సెట్లో ని వారందరినీ కూడా అభిప్రాయం అడుగుతుంటారట. మాములుగా ఎవరైనా ఏదైనా పని గురించి రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆలోచిస్తారని, కానీ రాజమౌళి మాత్రం ఎల్లవేళలా తన వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటారని, తాను చేసే పని పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, కార్య దీక్షే ఆయన భారత దేశం గర్వించదగ్గ దర్శకధీరుడిగా ఎన్నో గొప్ప సంచలన విజయాలు అందుకుంటూ ముందుకు సాగేలా చేశాయని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: