ఇటీవల బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ కరిం మొరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముగ్గురిలో జోయా కోకిలా బెన్‌ థీరుభాయ్ అంబానీ హస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా కరిం, షాజాలు నానావతి హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జోయా తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. హాస్పిటల్‌లో తన డైలీ రొటీన్‌ ఏంటో కూడా వివరించింది జోయా.

 

ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉంటున్న జోయా తన దిన చర్యను ఇలా వివరించింది. `హాస్పిటల్‌లో నా రోజు వారి కార్యక్రమాలు 6 గంటలకు మొదలవుతాయి. నేను నిద్ర లేవగానే ఫ్రెష్‌ అయి ప్రాణాయామం చేస్తా. వాటితో పాటు డాక్టర్లు సూచించిన కొన్ని ఎక్సర్‌సైజులు చేస్తా.. ఆ తరువాత హాస్పిటల్ వారు ఇచ్చే చాయ్ తాగుతాను. నిజం చెబుతున్న హాస్పిటల్ చాయ్‌ చాలా బాగుంది. తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఆరోగ్య పరిస్థితులపై చర్చించుకుంటాం.

 

తరువాత బింగేలో సినిమాలు, వెబ్ షోస్‌ చూడటం, ఇతర యాప్‌లను యూజ్‌ చేయటం లాంటి పనులు చేస్తాను. నా చుట్టూ ఎప్పుడూ డాక్టర్లు తిరుగుతుండటం చూస్తే నేను చందమామ మీద ఉన్నానేమో అనిపిస్తుంది. ఇది కూడా ఓ అనుభవమే త్వరలోనే ఈ పరిస్తితుల నుంచి బయట పడగలని ఆశిస్తున్నా` అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Feeling So overwhelmed watching the Dr’s , nurses and hospital staff taking care of us fearlessly! No words can describe .. i can see their discomfort in their protective suits yet 24 /7 on their toes serving us ... the true heroes for sure ... my Dr is so sweet and full of life , he constantly makes jokes and makes me feel so light.. yesterday he was the one to bring the news to me about testing positive and he was so sensitive and funny at the same time ( don’t know how he did that) so so grateful for Dr Saurabh Phadkare and his team ...Feeling so safe in his hands ... #coronavirus #covid19positivethoughts #indiafightscorona 🙅🏾‍♀️ 🌼🤞🏽💪🏽

A post shared by Zoa💫 (@zoamorani) on

మరింత సమాచారం తెలుసుకోండి: