వయసు ఆగదు, దాగదు, కాలం అలాంటిది మరి. వయసు పాదరసం అంటారు మహా కవులు. చూస్తూండగానే క్యాలండర్లోని పేజీలు అలా తిరిగేస్తాయి. దాంతో వయసు వద్దనా వచ్చిపడిపొతుంది. వయసు బాధ అందరికీ ఉంటుంది.

 

అయితే సినిమా తారలకు ఆ బాధ చాలా ఎక్కువ. వారి పెట్టుబడి వయసే. పదహారేళ్ళ అమ్మాయి హీరోయిన్ అంటేనే బుక్ చేస్తారు. జనం చూస్తారు. వయసు ఎంత ఉన్నా ఎపుడూ అలాగే ఉండాలని వారు చేయని ప్రయత్నం ఉండదు. వారు డైటింగులు, బ్యూటీ టిప్స్ తో తమను తాము ఎప్ప‌టికపుడు చెక్కుకుంటారు. నాజూకుగా ఉండాలని చూస్తారు.

 

అలాంటి హీరోయిన్లు, అందమైన భామలను కలలో కూడా అడగని ప్రశ్న ఉందంటే అది వయసుకు సంబంధించినదే. ఇంతకీ విషయం ఏంటంటే చందమామలా వచ్చి యువ రాణిలా కుర్ర గుండెల్లో గూడు కట్టుకున్న కాజల్ ని ఇపుడు అంతా ఆంటీ అనేస్తున్నారుట. దాంతో ఈ అమ్మడు తెగ గుస్సా అవుతోంది.

 

సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగులట. ఆంటీ పని అయిపోయింది. కుర్ర హీరోయిన్ల ముందు ఆమె దిగదుడుపు అంటున్నారుట. కాజల్ సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడడం లేదు. దాంతో ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న నెటిజన్ల మీద కాజల్ మాంచి గుస్సా మీద ఉందిట.

 

అయితే తమ కోపాన్ని ఆమె మాటల్లో చూపించడంలేదు.  టాలీవుడ్లో ఆమె ఇపుడు వరసగా అవకాశాలు సొంతం చేసుకుంటోంది. మెగాస్టార్  ఆచార్య మూవీలో చేస్తోంది. ఆ తరువాత పవన్ తోనూ మరో సినిమాకు కమిట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దన్నర అవుతున్న తన కెరీర్ కి ఢోకా లేదని అలా చెప్ప‌కనే చెబుతోంది. మొత్తానికి ఆంటీ అని సంబరం చేసుకున్న వారికి తానేంటో చూపిస్తోందిట. రానున్న టైమ్ తనదేనని గట్టి సవాల్ కూడా కాజల్ చేస్తోందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: