ఎప్పటికప్పుడు  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్. అంతేకాకుండా రష్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను ఆకట్టుకునేది, అలాగే తనపై ఏ నెటిజన్ అయినా తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోదు. ఇంకా నెటిజెన్స్ ఇచ్చే సలహాలు సూచనలతో రియాక్ట్ అవ్వడం రష్మీ కి అలవాటు.. 
తాజాగా ఇటువంటి సందర్భమే ఒకటి జరిగింది రష్మి గౌతమ్ విషయంలో... 

 


ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానాన్ని అమలులోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో  అన్ని రకాల సంస్థలు కూడా మూతపడ్డాయి. ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వడం జరిగింది.  అంతే కాకుండా కొంతమంది సామాజిక సేవ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో జంతువులకు ఆహారం ఎక్కడినుంచి దొరుకుతుందా అని భావించి రష్మి అండ్ టీం వాళ్ళు రోడ్లపై ఉన్న జంతువులకు ఆహారాన్ని సమకూర్చారు. ఇప్పుడు ఈ పిక్స్ రష్మీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది.

 


ఇది ఇలా ఉండగా... రష్మి చేసిన ఈ ట్వీట్ చూసి ఒక నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. అసలు నెటిజన్ ఏమి కామెంట్ చేసాడు అన్న విషయానికి వస్తే.. మీరు చేస్తున్న పని చాలా సూపర్ కానీ... మీరు ఆహారాన్ని పెట్టే సమయంలో న్యూస్ పేపర్ ఉపయోగించకుండా ఉండాల్సింది. అందులో ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్స్ ఉంటాయి, కనుక  దీనికి వేరే మార్గం చూడండి అని ఆ నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. ఇక నెటిజన్ చేసిన కామెంట్ కు రష్మీ బదులిస్తూ.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలేదు. ఈ తరుణంలో జంతువులకు ఫుడ్ పెట్టడమే చాలా కష్టం. కానీ ఈ సమయంలో వాళ్లు పెడుతున్నారు. దీన్ని చూసి సంతోషించాలి కానీ సలహాలు ఇవ్వకూడదు అంటూ సెటైర్ వేసింది రష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: