కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మనిషి ఎన్నో సాధించాడు కానీ కంటికి కనిపించని ఆ పురుగుని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడం లేదు. మనదేశంలో లాక్డౌన్ మరో పదిహేను రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశలవారిగా లాక్డౌన్ ని ఎత్తివేయాలని చూస్తున్నారు.

 

 

అయితే కరోనా వల్ల ప్రతీ పరిశ్రమ దెబ్బతింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా ప్రభావం ప్రతీ ఇండస్ట్రీ మీద ఉంది. చిల్లర వ్యాపారాలు మొదలుకుని, షేర్ మార్కెట్ వరకూ ప్రతీదీ కరోనా ధాటికి విలవిలా కొట్టుకుంటుంది. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమల్లో సినిమా రంగం కూడా ఒకటి. షూటింగులు లేక, థియేటర్లు మూతబడి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

 

 

ఈ సంక్షోభం ప్రభావం సినిమా పరిశ్రమపై చాలా రోజులు ఉండేలా ఉంది. లాక్డౌన్ పూర్తయ్యాక థియేటర్లు తెరుచుకున్నా జనాలు సినిమా చూడడానికి వచ్చేలా కనిపించట్లేదు. కరొనా భయం నలుగురు నిల్చున్న చోటికే వెళ్లనివ్వకుండా చేస్తున్న నేపథ్యంలో వందలమంది కలిసి చూసే థియేటర్లకి సినిమా చూడడానికి రావడం కష్టమే.ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మరో ఖాళీ సీట్ ఉండేలా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

 

 

అయితే సీట్ల మధ్య ఖాళీలు ఉంచడం మాత్రమే కాదు. సినిమా టికెట్ ధర కూడా తగ్గించాల్సిందే అని అంటున్నారు. కరోనా వల్ల పనులేమీ లేక, ఉద్యోగాలు కోల్పోయి, చేసిన పనికి సరైన జీతం అందకుండా ఉన్న పరిస్థితుల్లో సినిమా చూడ్డానికి వందల రూపాయలు ఖర్చు చేయడం కష్టమే. కాబట్టి జనాలని థియేటర్లకి రప్పించాలంటే టికెట్ ధర తగ్గించాల్సిందే. చూడాలి మరి నిర్మాతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: