ఉపాస‌న కొణిద‌ల మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భార్య త‌న అత్త సురేఖ గురించి మాట్లాడుతూ...నేను పుట్టి పెరిగింది ఉమ్మ‌డి కుటుంబంలో మా ఇంట్లో వాళ్ళంద‌రినీ క‌లిపితే 50 మంది పైనే ఉంటారు. అంతా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం. ఇక అంద‌రం క‌లిస్తే ఇంట్లో పండుగ‌లాగానే ఉంటుంది. అందుకే మా అత్త‌య్య‌గారిది కూడా ఉమ్మ‌డి కుటుంబం అయితే బావుంటుంది అనుకున్నా. చ‌ర‌ణ్ నేను ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఒక‌సారి మ‌నం పెళ్ళ‌య్యాక ఎక్క‌డ ఉంటాం అని అడ‌గ‌గా త‌ను కొన్న స్థ‌లం గురించి చెప్పి అక్క‌డే ఇల్లు క‌ట్టేస్తా అన్నాడు. అంటే పెళ్ళ‌య్యాక మేమిద్ద‌ర‌మే క‌లిసుండాలని త‌ను అనుకుంటున్నాడేమో అని భ‌య‌మేసింది. నాకేమ్ మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. కాసేప‌య్యాక పెళ్ళైన వెంట‌నే కుటుంబాన్ని వ‌దిలేసి విడిగా ఎలా ఉండ‌గ‌లుగుతారు అని అనేశాను.

 

క‌ట్ట‌బోయే ఇల్లు మ‌నం కేవ‌లం వీకెండ్‌లో ఉండ‌డానికే నువ్వేమంటావో అని అలా అనేసి న‌వ్వేశాడు. అప్పుడు హ‌మ్మ‌య్య అనుకున్నా. అత్త‌మ్మ సురేఖ అంటే చ‌ర‌ణ్‌కి ప్రాణం. ఇంట్లో ఒక్క‌క్ష‌ణం అత్త‌మ్మ లేక‌పోయినా విల‌విల‌లాడిపోతాడు. నాకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు వ‌ర‌కు నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఓ ప‌ది వ‌ర‌కు నాకు ప‌ప్పీలు ఉన్నాయి. రోజూ వాటితో కాసేపు గ‌డ‌పందే నాకు రోజు గ‌డ‌వ‌దు. పెళ్ళ‌య్యాక నాతోపాటు వాటిని కూడా తెచ్చుకుంటాన‌ని అత్త‌మ్మ‌ని అడ‌గ‌డానికి కాస్త మొహ‌మాట ప‌డ్డా ఇలాంటి విష‌యాల్లో చ‌ర‌ణ్ రిక‌మండేష‌న్ బావుండదు. పెళ్ళ‌య్యాక విష‌యం ఎలా చెప్పాలా అని స‌త‌మ‌త‌మ‌వుతుంటే...ఇక‌రోజు అత్త‌మ్మే నా ద‌గ్గ‌ర‌కొచ్చి నీతోపాటు ఎన్ని పెట్స్ తెచ్చుకున్నా నాకేమి అభ్యంత‌రం లేదు. ఎందుకంటే...అది ఇక నుంచి నీ ఇల్లు కూడా అని అన‌డంతో చాలా సంతోషం అనిపించింది. మా పెళ్ళ‌య్యాక ఇంట్లో బ‌య‌ట ఖాళీ స్థ‌లంలో పెట్స్ కోసం ఓ ఇంటినే క‌ట్టించారు. 

 

అడ‌గ‌కుండానే అంద‌రి అవ‌స‌రాలు, మ‌నసులు అర్ధం చేసుకునే అత్త‌మ్మ వాళ్ళ అత్త‌గారిని చాలా బాగా చూసుకుంటారు. ఆమె ప‌నుల‌న్నీ తానే ద‌గ్గ‌రుండి చేస్తారు. అంటే ఇప్పుడు మా ఇంట్లో రెండు త‌రాల కోడ‌ళ్ళం ఉన్నామ‌న‌మాట‌. అప్పుడ‌ప్పుడు చ‌ర‌ణ్ వాళ్ళ నానమ్మ‌గారు సురేఖ అత్త‌మ్మ వాళ్ళింట్లో పెద్ద కోడ‌లిగా ఎలా ఉన్నారో చెపుతారు. అప్పుడు ఇప్పుడు పిల్ల‌ర్‌గా నిలుచున్న అత్త‌మ్మ న‌న్నుకూడా ఎంతో ప్రోత్స‌హిస్తారు. త‌న ఇద్ద‌రి కూతుర్లు లాగానే న‌న్ను కూడా చూస్తారు. ఇక అత్త‌మ్మ‌ది ముక్కుసూటి మ‌న‌స్త‌త్వం ఏదైనా మొహంమీదే చెప్పేస్తారు. మావయ్య‌గారి సినిమాలు బావుంటే బావుంద‌ని లేదంటే లేద‌ని సూటిగా చెప్పేస్తారు. నేను కూడా ఆమె నుంచి అదే నేర్చుకున్నా. ఆమె వంట చాలా బాగా చేస్తారు. కానీ నేను డైటింగ్ కోసం వేరే ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల అది మిస్ అవుతున్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: