చిత్ర పరిశ్రమలో హీరో అయినా హీరోయిన్ అయినా వారసత్వాన్ని అండగా తీసుకొని ఎంట్రీ ఇస్తే అది కేవలం మొదటి సినిమా వరకే పనికి వస్తుంది. తమ వారు ఇండస్ట్రీలో స్టార్స్ అయినప్పటికి స్టార్ వారసురాలు అయినా వారసుడైనా ప్రేక్షకులను మెప్పించాల్సిందే. లేదంటే నిర్మొహమాటంగా వెనక్కి తిరగాల్సిందే. కానీ కొంతమంది మాత్రం తమ ఇమేజ్ ని సొంతగా సంపాదించుకోవడానికే ఇష్టపడతారు. ఎంచుకునే కథ, సినిమాలు తమకి గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా ఉండే వాటినే ఎంచుకుంటారు. కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. అయితే ఇక్కడ ఎవరూ ఓవర్ నైట్ స్టార్స్ అవరు. కొన్ని దెబ్బలు తగులుతాయి. కానీ వాటిని తట్టుకుంటేనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటారు.

 

ఇప్పుడు కీర్తీ సురేష్ కూడా అదే ప్రయాణం చేస్తోంది. కీర్తి సురేష్ 2015 లో త‌మిళంలో వచ్చిన 'ఇదు ఎన్న మాయమ్‌' సినిమాలో విక్ర‌మ్ ప్ర‌భు స‌ర‌స‌న‌, అలాగే 2016లో తెలుగులో హీరో రామ్ స‌ర‌స‌న 'నేను.. శైలజ' లో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే 'మహానటి' మాత్రం కీర్తి సురేష్ సినీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లా నిలవడమే కాదు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో గొప్ప నటిగా చెరగని ముద్ర వేసింది.

 

ఇక మ‌హాన‌టి సినిమా త‌ర్వాత తెలుగు తమిళం లో బోలెడు అవకాశాలు వచ్చాయి. కాని ఏది పడితే అది ఒప్పుకోకుండా తన కెరీర్ కి ఉపయోగపడే సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ .. అతి తక్కువ సమయంలోనే ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి ఒప్పుకొని చాలా పెద్ద రిస్క్ చేశాను. అయితే ఈ రిస్క్ నన్ను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేస్తుందని ఊహించలేదు. ఇంత తక్కువ సమయంలో చేసిన అతి కొద్ది సినిమాలలోనే జాతీయ అవార్డు సాధిస్తానని అనుకోలేదంటూ .. చెప్పుకొచ్చింది.

 

ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా తెర‌కెక్కుతున్న‌ 'అన్నాత్తే' ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే తెలుగు, తమిళంలో హీరోయిన్ గా నటించిన  'మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖి, పెంగ్విన్‌ ' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా నితిన్ తో రెండు సినిమాలు చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో కొత్త చిత్రం లో నటించబోతుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: